4 రోజుల సీబీఐ కస్టడీకి ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) ఉద్యోగుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్‌ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ పాండేను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) 4 రోజుల కస్టడీకి తీసుకుంది.

Published : 25 Sep 2022 02:17 IST

ఎన్‌ఎస్‌ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు

దిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) ఉద్యోగుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్‌ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ పాండేను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) 4 రోజుల కస్టడీకి తీసుకుంది. ఇప్పటికే అతను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు చేస్తున్న కేసులో జుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. సీబీఐ సంజయ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వద్ద కోరగా, 4 రోజుల విచారణకు అనుమతి లభించింది. పాండేతో పాటు ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈఓలు చిత్రా రామకృష్ణ, రవి నరైన్‌లను కూడా సీబీఐ ఈ కేసులో చేర్చింది. ఎన్‌ఎస్‌ఈ సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించే ఐసెక్‌ సెక్యూరిటీస్‌ ప్రై.లి, 2009-17 మధ్య కాలంలో ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగుల ఫోన్లను అక్రమంగా ట్యాప్‌ చేసిందని సీబీఐ వెల్లడించింది. ఈ కంపెనీని 2001 మార్చిలో పాండే స్థాపించారు. 2006 మేలో కంపెనీ డైరెక్టర్‌ హోదా నుంచి ఆయన బయటకొచ్చేశారు. ఆ తర్వాత అతని కుమారుడు, తల్లి కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని