2022-23లో రూ.8,00,000 కోట్ల ఎఫ్‌డీఐలు రావొచ్చు!

ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో మన దేశం 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (ఎఫ్‌డీఐలు) ఆకర్షించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. దేశీయంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, సులభతర

Published : 25 Sep 2022 02:17 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో మన దేశం 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (ఎఫ్‌డీఐలు) ఆకర్షించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. దేశీయంగా చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, సులభతర వ్యాపార నిర్వహణ వంటివి ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. 2021-22లో ఇప్పటి వరకు అత్యధికంగా 83.6 బి.డాలర్ల (రూ.6.69 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐలు మన దేశానికి తరలివచ్చాయి. 101 దేశాల నుంచి ఎఫ్‌డీఐలు వచ్చాయి.
అయితే 2022-23 ఏప్రిల్‌-జూన్‌లో ఎఫ్‌డీఐలు 6 శాతం తగ్గి 16.6 బి.డాలర్లు మాత్రమే దేశంలోకి రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని