మీనాక్షి ఎనర్జీ కేసులో సీమెన్స్‌ వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన ఎన్‌సీఎల్‌ఏటీ

తమ బ్యాంక్‌ గ్యారెంటీలను మీనాక్షి ఎనర్జీ (ఎంఈఎల్‌) వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సీమెన్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)  తోసిపుచ్చింది.

Published : 26 Sep 2022 02:07 IST

దిల్లీ: తమ బ్యాంక్‌ గ్యారెంటీలను మీనాక్షి ఎనర్జీ (ఎంఈఎల్‌) వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సీమెన్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)  తోసిపుచ్చింది. ప్రస్తుతం మీనాక్షి ఎనర్జీ దివాలా ప్రక్రియ ఎదుర్కొంటోంది. మీనాక్షి ఎనర్జీ ఏర్పాటు చేయాలనుకున్న 700 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ ప్రాజెక్టులో సబ్‌-కాంట్రాక్టర్‌గా సీమెన్స్‌ ఉండేది. ఈ కేసులో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ గతంలో ఇచ్చిన తీర్పును ఎన్‌సీఎల్‌ఏటీ సమర్థించింది. ఒప్పందం ప్రకారం, సీమెన్స్‌ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనందునే, మీనాక్షి ఎనర్జీ బ్యాంక్‌ గ్యారెంటీలను అమలు చేసినట్లు ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది.  ఇందులో ఎలాంటి చట్ట విరుద్ధమైన, మోసపూరితమైన చర్యలు లేవని ఇద్దరు సభ్యులతో కూడిన ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం వెల్లడిస్తూ సీమెన్స్‌ వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఎంఈఎల్‌ పరిష్కార నిపుణుడు రూ.2.50 కోట్ల విడుదలకు అభ్యర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని