బీవీఆర్‌ మోహన్‌రెడ్డి రచన.. ‘ఇంజినీర్డ్‌ ఇన్‌ ఇండియా’

అంతర్జాతీయ డిజిటల్‌ పరిష్కారాల సంస్థ సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, పద్మశ్రీ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి రచయితగా మారి తన వ్యవస్థాపక ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకు వచ్చారని

Published : 26 Sep 2022 02:08 IST

దిల్లీ: అంతర్జాతీయ డిజిటల్‌ పరిష్కారాల సంస్థ సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, పద్మశ్రీ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి రచయితగా మారి తన వ్యవస్థాపక ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకు వచ్చారని పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా (పీఆర్‌హెచ్‌ఐ) ప్రకటించింది. ఈ పుస్తకానికి ‘ఇంజినీర్డ్‌ ఇన్‌ ఇండియా: ఫ్రమ్‌ డ్రీమ్స్‌ టు బిలియన్‌ డాలర్‌ సైయెంట్‌’ అనే పేరు పెట్టారు. 1974లో ఐఐటీ కాన్పూర్‌ ఆవరణ నుంచి బయటకు వచ్చిన యువకుడు (మోహన్‌రెడ్డి), దేశ నిర్మాణానికి తన వంతు మద్దతు తెలిపేందుకు వ్యాపారవేత్తగా మారడం, తన సంస్థను ఉన్నతంగా తీర్దిదిద్దిన క్రమాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ‘నా ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని తదుపరి తరం ముందుకెళ్లాలన్న సదుద్దేశంతో ఈ పుస్తకం రాశాను. నా కంటే గొప్పగా లక్ష్యాల్ని నిర్దేశించుకుని, నేటి యువత విజయ తీరాలకు చేరాలనుకుంటున్నాను. అంతర్జాతీయ సంస్థగా సైయెంట్‌ను మార్చడానికి పడిన శ్రమను, ఎదుర్కొన్న సవాళ్లను వివరించడం వల్ల, ఔత్సాహికులకు ఉపయోగపడుతుంద’ని మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో, సంప్రదాయ విక్రయశాలల్లో అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని