సేల్స్‌ఫోర్స్‌ ఇండియాలో 2,500 నియామకాలు

వచ్చే జనవరి కల్లా భారత్‌లో మరో 2,500 నియామకాలు చేపట్టి, తమ ఉద్యోగుల సంఖ్యను 10,000కు పెంచుతామని సేల్స్‌ఫోర్స్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌, సీఈఓ అరుంధతీ భట్టాచార్య తెలిపారు.

Published : 26 Sep 2022 02:13 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: వచ్చే జనవరి కల్లా భారత్‌లో మరో 2,500 నియామకాలు చేపట్టి, తమ ఉద్యోగుల సంఖ్యను 10,000కు పెంచుతామని సేల్స్‌ఫోర్స్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌, సీఈఓ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. భారత్‌లో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ), తయారీ, సేవలు, సామాజిక సేవల విభాగాలపై కంపెనీ దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సేల్స్‌ఫోర్స్‌ ఇండియాలో దాదాపు 7,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్లౌడ్‌ ఆధారిత సేవలు అందించే ఈ సంస్థకు హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, పుణె, గురుగ్రామ్‌, జయపూర్‌ నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి. 2020 ఏప్రిల్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 2500 నుంచి 7,500కు పెంచుకుంది. రాబోయే రోజుల్లో కార్యాలయాల నుంచి పనిచేసే వారి సంఖ్య పెరుగుతుందని, దీంతో భాగస్వామ్యం, సహకారం వంటివి పెరగొచ్చని అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను కార్యాలయాలకు తీసుకురాలేకపోతే, సంస్థకు ఒక గుర్తింపును సృష్టించడం కష్టమవుతుందని అన్నారు. సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (సాస్‌) కంపెనీలు, క్లౌడ్‌ ఆధారిత కంపెనీలు వినియోగించే కొత్త తరం టెక్నాలజీలను నేర్చుకోవాల్సిందిగా యువతకు సూచించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని