సుజ్లాన్‌ రైట్స్‌ ఇష్యూ

రైట్స్‌ ఇష్యూలో 240 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా రూ.1200 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు సుజ్లాన్‌ ఎనర్జీ వెల్లడించింది.

Published : 26 Sep 2022 02:13 IST

దిల్లీ: రైట్స్‌ ఇష్యూలో 240 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా రూ.1200 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు సుజ్లాన్‌ ఎనర్జీ వెల్లడించింది. ఆదివారం జరిగిన బోర్డు సమావేశంలో రైట్స్‌ ఇష్యూకు సెక్యూరిటీస్‌ ఇష్యూ కమిటీ అనుమతి ఇచ్చినట్లు ఎక్స్ఛేంజీలకు సంస్థ తెలిపింది. రూ.2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు, కనీస ధరగా రూ.5ను కంపెనీ నిర్ణయించింది. ఇష్యూ తర్వాత (పూర్తి స్పందన లభిస్తే) ఔట్‌స్టాండింగ్‌ ఈక్విటీ షేర్ల సంఖ్య 1007,30,87,083 నుంచి 1247,30,87,083కు చేరుతుంది. కంపెనీలో అర్హులైన వాటాదార్లకు ప్రతి 21 ఫుల్లీ పెయిడప్‌ ఈక్విటీ షేర్లకు 5 రైట్స్‌ ఇష్యూ ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అర్హులైన వాటాదార్లకు 5 లేదా అంతకంటే ఎక్కువ షేర్లు ఉంటే.. కనీసం ఒక ఈక్విటీ షేరును ఇస్తారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని