5 నెలలు.. 70 లక్షల ఫండ్‌ ఖాతాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మొదటి 5 నెలల్లో మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) సంస్థలు కొత్తగా 70 లక్షల మదుపరి ఖాతాలను జతచేసుకోవడంతో, మొత్తం ఖాతాల సంఖ్య 13.6 కోట్లకు పెరిగినట్లు...

Published : 26 Sep 2022 02:13 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మొదటి 5 నెలల్లో మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) సంస్థలు కొత్తగా 70 లక్షల మదుపరి ఖాతాలను జతచేసుకోవడంతో, మొత్తం ఖాతాల సంఖ్య 13.6 కోట్లకు పెరిగినట్లు భారత మ్యూచువల్‌ ఫండ్‌ల సంఘం (యాంఫీ) తెలిపింది. 43 ఎంఎఫ్‌ సంస్థల్లో ఫోలియోల సంఖ్య 2022 మార్చి ఆఖరుకు 12.95 కోట్లుగా ఉండగా ఆగస్టు చివరకు 13.65 కోట్లకు చేరింది. మ్యూచువల్‌ ఫండ్‌లపై అవగాహన పెరగడానికి తోడు డిజిటల్‌ వినియోగం అధికం కావడం ఇందుకు దోహదపడింది. ‘కొవిడ్‌-19 సంక్షోభం తరవాత ప్రజల పొదుపు సరళిలో మార్పులొచ్చాయి. స్టాక్‌ మార్కెట్‌పై బుల్లిష్‌ వైఖరితో, క్రమానుగత పెట్టుబడు (సిప్‌)లకు అలవాటుపడ్డారు. దీంతో మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అఖిల్‌ చతుర్వేది పేర్కొన్నారు.

* 2021 మేలో 10 కోట్ల ఫోలియోల మైలురాయిని పరిశ్రమ అధిగమించింది. మొత్తం ఆస్తుల్లో రిటైల్‌ మదుపర్ల వాటా 55.2 శాతం నుంచి 56.2 శాతానికి పెరిగింది.

* డెట్‌ విభాగం చూస్తే.. 17.53 లక్షల ఫోలియోలతో లిక్విడ్‌ ఫండ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. లో డ్యూరేషన్‌ ఫండ్‌లు (9.95 లక్షలు), కార్పొరేట్‌ బాండ్‌ (6.3 లక్షలు), అల్ట్రా షార్ట్‌ డ్యూరేషన్‌ ఫండ్‌లు (6.21 లక్షలు), ఓవర్‌నైట్‌ ఫండ్‌ (6.09 లక్షలు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts