పసుపు రాణింపు!

పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.49,044 కంటే కిందకు వస్తే మరింతగా దిద్దుబాటుకు గురయి, రూ.48,951; రూ.48,213 వరకు దిగి  రావచ్చు.

Published : 26 Sep 2022 02:19 IST

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం

పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.49,044 కంటే కిందకు వస్తే మరింతగా దిద్దుబాటుకు గురయి, రూ.48,951; రూ.48,213 వరకు దిగి  రావచ్చు. ఒకవేళ నిరోధ స్థాయైన రూ.50,036 కంటే పైకి వెళితే రూ.50,671; రూ.51,167 వరకు పెరగొచ్చు.
* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ అక్టోబరు కాంట్రాక్టు రూ.13,867 కంటే పైన కదలాడితేనే రాణించే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కాంట్రాక్టుకు ప్రతికూల ధోరణి కొనసాగుతున్నందున, రూ.13,507 వరకు దిగి రావచ్చు. అందువల్ల లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు స్టాప్‌లాస్‌ సవరించుకుని, వాటిని కొనసాగించడం మంచిది.


వెండి

వెండి డిసెంబరు కాంట్రాక్టు రూ.55,761 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే.. కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. అయితే రూ.57,812 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనినీ అధిగమిస్తే రూ.59,392 వరకు పెరగొచ్చు.  


ప్రాథమిక లోహాలు

* రాగి అక్టోబరు కాంట్రాక్టు రూ.651 కంటే పైన కదలాడితే రూ.661; రూ.671 వరకు పెరిగే అవకాశం ఉంది.
* సీసం అక్టోబరు కాంట్రాక్టు రూ.179.65 కంటే పైన చలిస్తే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. అయితే రూ.176 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణించాలి.
* జింక్‌ అక్టోబరు కాంట్రాక్టు బలహీనంగా కనిపిస్తోంది. రూ.281 కంటే పైన కదలాడకుంటే షార్ట్‌ సెల్‌ పొజిషన్లకు మొగ్గు చూపొచ్చు.
* అల్యూమినియం అక్టోబరు కాంట్రాక్టు రూ.198 ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణికి ఆస్కారం ఉంది.


ఇంధన రంగం

* ముడి చమురు అక్టోబరు కాంట్రాక్టు రూ.6,813 కంటే పైన కదలాడకుంటే.. రూ.6,400, రూ.6216, రూ.6107 వరకు కూడా దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ  రూ.6,705 స్థాయి దిశగా సాగితే రూ.6,813, రూ.7075 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
* సహజవాయువు అక్టోబరు కాంట్రాక్టు రూ.631 కంటే పైన చలించకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయిని అధిగమిస్తే రూ.661 వరకు పెరగొచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు అక్టోబరు కాంట్రాక్టు రూ.7,045 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే.. రూ.7,472 వరకు పెరిగే అవకాశం ఉంది.
* జీలకర్ర అక్టోబరు కాంట్రాక్టు రూ.25,465 కంటే పైన కదలాడితే మరింతగా రాణిస్తుంది. అందువల్ల ఈ స్థాయికి ఎగువన షార్ట్‌ సెల్‌ పొజిషన్లకు దూరంగా ఉండాలి.
* ధనియాలు అక్టోబరు కాంట్రాక్టు రూ.10,383 కంటే దిగువన ట్రేడయితే, రూ.10,196 వరకు పడిపోవచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.10,795 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.11,020 వరకు పెరుగుతుందని భావించవచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని