ఇ-కామర్స్‌ ఆర్డర్లు 28 శాతం పెరిగాయ్‌

పండగ విక్రయాలు ప్రారంభమైన తొలి 2 రోజుల్లో ఇ-కామర్స్‌ పోర్టళ్లకు ఆర్డర్లు, గతేడాది విక్రయాలతో పోలిస్తే 28 శాతం పెరిగాయని సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ ప్లాట్‌ఫామ్‌ యూనికామర్స్‌ వెల్లడించింది. ఇ-కామర్స్‌ సంస్థలతో పాటు, వాటిల్లో ఉత్పత్తులు విక్రయించే

Published : 26 Sep 2022 02:37 IST

దిల్లీ: పండగ విక్రయాలు ప్రారంభమైన తొలి 2 రోజుల్లో ఇ-కామర్స్‌ పోర్టళ్లకు ఆర్డర్లు, గతేడాది విక్రయాలతో పోలిస్తే 28 శాతం పెరిగాయని సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ ప్లాట్‌ఫామ్‌ యూనికామర్స్‌ వెల్లడించింది. ఇ-కామర్స్‌ సంస్థలతో పాటు, వాటిల్లో ఉత్పత్తులు విక్రయించే 15,000 మంది వ్యాపారులు, 7,000 గోదాములు, 1500 విక్రయశాలలకు ఈ సంస్థ సేవలందిస్తోంది. ఈనెల 23, 24 తేదీల్లో ఇ-కామర్స్‌ సంస్థలకు 70 లక్షల ఉత్పత్తులకు ఆర్డర్‌ రాగా, ప్రాసెస్‌ జరుగుతున్నట్లు తెలిపింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో 70%, ఎలక్ట్రానిక్స్‌లో 48% (మొబైల్స్‌ మినహాయించి), ఫ్యాషన్‌ ఉత్పత్తుల్లో 7 శాతం వృద్ధి లభించిందని, హోమ్‌ డెకార్‌, గిఫ్టింగ్‌కి పనికొచ్చేవి, ఫర్నీచర్‌, ఆభరణాల   అమ్మకాల్లోనూ వృద్ధి బాగుందని తెలిపింది.

* మూడు-రెండో అంచె నగరాల ఆర్డర్లలో వరుసగా 32 శాతం, 20 శాతం వృద్ధి లభించిందని పేర్కొంది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సందర్భంగా, తమ మొత్తం వినియోగదార్లలో 75 శాతం మంది 2-3 అంచె నగరాల నుంచే ఉన్నట్లు అమెజాన్‌ ఇండియా తెలిపింది.

తొలిరోజే రూ.1,000 కోట్ల స్మార్ట్‌ఫోన్ల విక్రయం: శామ్‌సంగ్‌
పండగ విక్రయాల తొలిరోజునే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా రూ.1,000 కోట్ల విలువైన 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు విక్రయించినట్లు ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ ఇండియా ప్రకటించింది. ఫోన్ల ధరలను 17-60 శాతం తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. అమెజాన్‌లో విక్రయించిన ప్రతి 3 ఫోన్లలో ఒకటి శామ్‌సంగ్‌దేనని, అత్యధికంగా గెలాక్సీ ఎం13 విక్రయమైందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని