మరో 6 నెలల వరకు ప్రస్తుత విదేశీ వాణిజ్య విధానమే

విదేశీ వాణిజ్య కొత్త విధానం అమలును మరో 6 నెలలు వాయిదా వేసి, ప్రస్తుత విధానాన్నే  కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ అనిశ్చితులు, కరెన్సీలో ఒడుదొడుకుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ వాణిజ్య ప్రస్తుత విధానం

Published : 27 Sep 2022 02:27 IST

దిల్లీ: విదేశీ వాణిజ్య కొత్త విధానం అమలును మరో 6 నెలలు వాయిదా వేసి, ప్రస్తుత విధానాన్నే  కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ అనిశ్చితులు, కరెన్సీలో ఒడుదొడుకుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ వాణిజ్య ప్రస్తుత విధానం ఈ నెల 30తో ముగియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త విధానం వద్దని పరిశ్రమ సంఘాలు, ఎగుమతుల ప్రోత్సాహక మండళ్లు నుంచి వినతులు వచ్చినట్లు వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అమిత్‌ యాదవ్‌ చెప్పారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోనే కొత్త ఆర్థిక విధానాన్ని తెస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని  వాళ్లు వెలిబుచ్చారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం అంతా ప్రస్తుత విదేశీ వాణిజ్య విధానమే కొనసాగుతుందని తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts