2025 నుంచి స్మార్ట్‌ఫోన్లలో నావిక్‌ నేవిగేషన్‌ వ్యవస్థ!

దేశీయంగా అభివృద్ధి చేసిన నేవిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ను, దేశీయ తయారీ స్మార్ట్‌ఫోన్లలో 2025 జనవరి 1 నుంచి నిక్షిప్తం చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం చేస్తోంది. ప్రస్తుతం అమెరికా నేవిగేషన్‌ వ్యవస్థ జీపీఎస్‌, రష్యా నేవిగేషన్‌ వ్యవస్థ గ్లోనాజ్‌లు

Published : 27 Sep 2022 02:27 IST

దిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన నేవిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ను, దేశీయ తయారీ స్మార్ట్‌ఫోన్లలో 2025 జనవరి 1 నుంచి నిక్షిప్తం చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం చేస్తోంది. ప్రస్తుతం అమెరికా నేవిగేషన్‌ వ్యవస్థ జీపీఎస్‌, రష్యా నేవిగేషన్‌ వ్యవస్థ గ్లోనాజ్‌లు స్మార్ట్‌ఫోన్లలో ఉన్నాయి. ఇప్పటి స్మార్ట్‌ఫోన్లలో అమర్చుతున్న చిప్‌సెట్లు ఎల్‌1 ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను మాత్రమే సపోర్ట్‌ చేస్తాయి. జీపీఎస్‌, గ్లోనాజ్‌ ఇందుకు అనువైనవి. నావిక్‌ మాత్రం ఎల్‌ 5 ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఇందుకనుగుణమైన చిప్‌సెట్లు స్నాప్‌డ్రాగన్‌ 720జీ, 662, 460తో పాటు, మీడియాటెక్‌ చిప్‌సెట్లు కొంత హార్డ్‌వేర్‌ మార్పులతో నావిక్‌కు అనుగుణంగా ఉన్నాయి. ఇవి తక్కువగా అందుబాటులో ఉన్నాయి. నావిక్‌ను ఇప్పుడే స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి తేవాలంటే, చిప్‌సెట్‌ రూపేణ అదనపు భారం తప్పదని శామ్‌సంగ్‌, ఓపో సహా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించాయి. పైగా భారత్‌కు ప్రత్యేకించేలా హార్డ్‌వేర్‌ డిజైన్‌తో పాటు కొన్ని ఉత్పత్తులను మార్చాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. 2024-25లో ఇస్రో ప్రయోగించనున్న శాటిలైట్‌ ఎల్‌1 ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌కు అందుబాటులో ఉంటుంది. అందువల్ల నావిక్‌ వినియోగానికి దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీదార్లకు మరో రెండేళ్లకు పైగా సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని