భారత్‌ తయారీ ఐఫోన్‌ 14.. త్వరలోనే

యాపిల్‌ ఈనెల 7న విడుదల చేసిన ఐఫోన్‌ 14 మోడల్‌ ఫోన్లు.. మన దేశంలోనూ తయారవుతున్నాయి. దేశీయంగా అసెంబ్లింగ్‌ చేస్తున్న ఐఫోన్‌ 14 మోడళ్లు మరికొన్ని రోజుల్లోనే వినియోగదారులకు అందుబాటులోకి రావొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Published : 27 Sep 2022 02:27 IST

దిల్లీ: యాపిల్‌ ఈనెల 7న విడుదల చేసిన ఐఫోన్‌ 14 మోడల్‌ ఫోన్లు.. మన దేశంలోనూ తయారవుతున్నాయి. దేశీయంగా అసెంబ్లింగ్‌ చేస్తున్న ఐఫోన్‌ 14 మోడళ్లు మరికొన్ని రోజుల్లోనే వినియోగదారులకు అందుబాటులోకి రావొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నై సమీపంలోని శ్రీపెరంబదూరు వద్ద ఉన్న ప్లాంటులో ఫాక్స్‌కాన్‌ ఐఫోన్‌ 14 ఫోన్లను అసెంబ్లింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిని దేశీయంగా విక్రయించడంతో పాటు ఎగుమతులూ చేస్తారు. భారత్‌లో ఐఫోన్‌ 14  తయారీ ప్రక్రియను ఎంతో ఉత్సుకతతో చేపట్టినట్లు సంస్థ పేర్కొంది. ఈ మోడల్‌లో నాలుగు రకాలు - ఐఫోన్‌ 14, ప్లస్‌, ప్రో, ప్రోమ్యాక్స్‌ ఉన్నాయి. చైనా తర్వాత రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విపణిగా ఉన్న భారత్‌లో ఐఫోన్ల తయారీకి యాపిల్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. 2017లో ఐఫోన్ల తయారీని యాపిల్‌ ఇక్కడ ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని