మేఘా గ్యాస్‌.. ఇకపై మేఘా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌

ఎంఈఐఎల్‌ గ్రూపునకు చెందిన మేఘా గ్యాస్‌ పేరు మారింది. ఇకపై ఈ సంస్థను మేఘా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎంసీజీడీపీఎల్‌)గా వ్యవహరిస్తారు. ఈ సంస్థ పేరు మార్పునకు, చేతిలో ఉన్న ప్రాజెక్టులను

Published : 27 Sep 2022 02:27 IST

అయిదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఈఐఎల్‌ గ్రూపునకు చెందిన మేఘా గ్యాస్‌ పేరు మారింది. ఇకపై ఈ సంస్థను మేఘా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎంసీజీడీపీఎల్‌)గా వ్యవహరిస్తారు. ఈ సంస్థ పేరు మార్పునకు, చేతిలో ఉన్న ప్రాజెక్టులను కొనసాగించేందుకు పెట్రోలియం- సహజ వాయువు నియంత్రణ మండలి అంగీకారాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిటీ గ్యాస్‌ పంపిణీ కార్యకలాపాలను మేఘా గ్యాస్‌ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, ఒడిశా, రాజస్థాన్‌, కర్ణాటకలో ఇప్పటికే సంస్థ ఆధ్వర్యంలో గ్యాస్‌ పంపిణీ కార్యకలాపాలు మొదలయ్యాయి. దాదాపు 60కి పైగా సీఎన్‌జీ స్టేషన్లను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పింది. సిటీ గ్యాస్‌ పంపిణీ కార్యకలాపాలపై ఇప్పటి వరకూ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టామని,  అయిదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మేఘా ఇంజినీరింగ్‌ గ్రూపు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని