నెలకు రూ.700 కోట్ల రుణాలు: శామ్‌సంగ్‌

తమ ఖరీదైన మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్న శామ్‌సంగ్‌, ఇందుకోసం యాక్సిస్‌బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును ఆవిష్కరించింది. ఆయా ఉత్పత్తులపై ఉన్న ఆఫర్లకు తోడు, ఏడాది మొత్తంమీద

Published : 27 Sep 2022 02:27 IST

యాక్సిస్‌ బ్యాంక్‌తో కలిసి క్రెడిట్‌కార్డు ఆవిష్కరణ

దిల్లీ: తమ ఖరీదైన మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్న శామ్‌సంగ్‌, ఇందుకోసం యాక్సిస్‌బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును ఆవిష్కరించింది. ఆయా ఉత్పత్తులపై ఉన్న ఆఫర్లకు తోడు, ఏడాది మొత్తంమీద శామ్‌సంగ్‌ ఉత్పత్తుల కొనుగోలుపై రూ.10,000-20,000 వరకు నగదు వెనక్కి ఇస్తామని పేర్కొంది. శామ్‌సంగ్‌ ఉత్పత్తుల కొనుగోలు కోసం శామ్‌సంగ్‌ ఫైనాన్స్‌ ప్లస్‌ ద్వారా ఇస్తున్న రుణ లావాదేవీల్లో 3 రెట్ల వృద్ధి లభిస్తోందని శామ్‌సంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మొబైల్‌వ్యాపారం) రాజు పుల్లన్‌ తెలిపారు. గతేడాది నెలకు రూ.250 కోట్ల రుణాలు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇవ్వగా, ఈ ఏడాది సగటున నెలకు రూ.700 కోట్ల మేర జారీ చేస్తున్నట్లు వివరించారు. 2017లో ప్రారంభించిన శామ్‌సంగ్‌ పేలో 3 కోట్ల మంది నమోదిత వినియోగదారులున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని