దేశీయంగా సరిపడా ఫారెక్స్‌ నిల్వలు ఉన్నాయ్‌!

మనదేశ అవసరాలకు సరిపడా విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలున్నాయని, ఎటువంటి ఆందోళనలు అవసరం లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ స్పందించారు.

Published : 28 Sep 2022 02:06 IST

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌

దిల్లీ: మనదేశ అవసరాలకు సరిపడా విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలున్నాయని, ఎటువంటి ఆందోళనలు అవసరం లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ స్పందించారు. అంతర్జాతీయ అనిశ్చితిని ఎదుర్కొనేంద]ుకు మన నిల్వలు సరిపోతాయని ఆయన వెల్లడించారు. సెప్టెంబరు 16 నాటికి ఫారెక్స్‌ నిల్వలు 545.65 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2021 సెప్టెంబరు 3న ఇవి 642.453 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం. అంటే ఏడాది వ్యవధిలో 96 బిలియన్‌ డాలర్లకు పైగా ఫారెక్స్‌ నిల్వలు తగ్గిపోయాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, రూపాయి విలువ కాపాడేందుకు ఆర్‌బీఐ ఫారెక్స్‌ నిల్వల్ని వినియోగిస్తున్నందునా, నిల్వలు తగ్గాయి. ‘విదేశాల నుంచి పెట్టుడులు తగ్గడం, వాణిజ్య లోటు పెరగడంతో ఫారెక్స్‌ నిల్వలు తగ్గుతున్నాయి. దీనిపై నేను ఆందోళన చెందను. ఎందుకంటే మన వద్ద ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు అవసరమైన భారీ నిల్వలు ఉన్నాయ’ని అజయ్‌ సేథ్‌ వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts