టొరెంట్‌ ఫార్మా చేతికి క్యురేషియో హెల్త్‌కేర్‌

చర్మ సంబంధ చికిత్సా విభాగంలో తమ ఉనికిని బలోపేతం చేసుకునేందుకు క్యురేషియో హెల్త్‌కేర్‌ను రూ.2,000 కోట్లతో కొనుగోలు చేయబోతున్నట్లు టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ మంగళవారం వెల్లడించింది.

Published : 28 Sep 2022 02:06 IST

దిల్లీ: చర్మ సంబంధ చికిత్సా విభాగంలో తమ ఉనికిని బలోపేతం చేసుకునేందుకు క్యురేషియో హెల్త్‌కేర్‌ను రూ.2,000 కోట్లతో కొనుగోలు చేయబోతున్నట్లు టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ మంగళవారం వెల్లడించింది. క్యురేషియోలో 100 శాతం వాటా కొనుగోలు చేసేందుకు కచ్చితమైన ఒప్పందం చేసుకున్నట్లు టొరెంట్‌ ఫార్మా ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. క్యురేషియో కొనుగోలుతో విభిన్న పోర్ట్‌ఫోలియోతో బలంగా మారతామని టొరెంట్‌ ఫార్మా డైరెక్టర్‌ అమన్‌ మెహతా వెల్లడించారు. చెన్నై ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు సాగిస్తున్న క్యురేషియో వద్ద టెడిబార్‌, అటోగ్లా, స్పూ, బి4 నప్పి, పెర్మైట్‌ వంటి 50కి పైగా బ్రాండ్లున్నాయి. మొత్తం కంపెనీ ఆదాయంలో 75 శాతం టాప్‌-10 బ్రాండ్ల నుంచే వస్తోంది. 2021-22లో ఈ కంపెనీకి రూ.224 కోట్ల ఆదాయం రాగా, ఇందులో చర్మ సంబంధిత ఔషధాల నుంచే 82 శాతం వచ్చింది. ఈ సంస్థ కొనుగోలుతో టొరెంట్‌ ఫార్మాకు 600 మంది మెడికల్‌ రెప్రజెంటేటివ్‌లు, 900 మంది స్టాకిస్ట్‌లు జత అవుతారు. క్యురేషియో ప్రమోటర్లతో పాటు సిఖోయా, క్రిస్‌ క్యాపిటల్‌ కూడా ఈ లావాదేవీతో బయటకు వస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని