గూగుల్‌ ఇండియా పాలసీ హెడ్‌ అర్చన గులేటి రాజీనామా!

గూగుల్‌ ఇండియాలో ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా ఉన్న అర్చన గులేటి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఐదు నెలల క్రితమే గూగుల్‌ ఇండియాలో చేరారు.

Published : 28 Sep 2022 02:06 IST

దిల్లీ: గూగుల్‌ ఇండియాలో ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా ఉన్న అర్చన గులేటి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఐదు నెలల క్రితమే గూగుల్‌ ఇండియాలో చేరారు. అంతకుముందు నీతిఆయోగ్‌లో సంయుక్త కార్యదర్శిగా (డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌) పనిచేశారు. గూగుల్‌ పదవికి ఆమె ఎందుకు రాజీనామా చేశారనే విషయం వెల్లడి కాలేదు. భారత్‌లో పలు యాంటీ ట్రస్ట్‌ కేసులను గూగుల్‌ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అర్చన గులేటి రాజీనామా చేయడం గమనార్హం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని