మొబైల్‌ ఫోన్ల మోసాలకు చెక్‌

ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెల ఐఎంఈఐ (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు) ఉంటుంది. 2023 జనవరి 1 నుంచి దేశంలో విక్రయించే ప్రతి మొబైల్‌ ఫోన్‌ని,.....

Published : 28 Sep 2022 02:06 IST

జనవరి 1 నుంచి ప్రత్యేక పోర్టల్‌లో ఐఎంఈఐ నమోదు 

దిల్లీ: ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెల ఐఎంఈఐ (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు) ఉంటుంది. 2023 జనవరి 1 నుంచి దేశంలో విక్రయించే ప్రతి మొబైల్‌ ఫోన్‌ని, టెలికాం విభాగం (డాట్‌) నిర్వహిస్తున్న ఇండియన్‌ కౌంటర్‌ఫీటెడ్‌ డివైస్‌ రిస్ట్రిక్షన్‌ పోర్టల్‌ (ఐసీడీఆర్‌)లో నమోదు చేసి, ఐఎంఈఐ సర్టిఫికెట్‌లను తయారీ సంస్థలు పొందాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయించే ఫోన్లకూ దిగుమతిదార్లు ఇలా చేయాల్సిందే. సిమ్‌కార్డు మార్చినా, మొబైల్‌కు ఉంటే ఐఎంఈఐ మారదు కనుక, నేరగాళ్లను పట్టుకోవడం సులభం అవుతుంది. చోరీకి గురైన ఫోన్లను గుర్తించి, స్తంభింప చేసేందుకు మాత్రమే ప్రస్తుతం సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌), దాని అనుబంధంగా ఐసీడీఆర్‌ పనిచేస్తున్నాయి. ఫిర్యాదిదారులు తెలిపిన ఐంఎంఈఐ సంఖ్యలు మాత్రమే వీటిల్లో నమోదవుతున్నాయి. చోరీ చేసిన ఫోన్లకు, వేరే ఫోన్ల ఐఎంఈఐ నంబరు వేస్తూ, వినియోగంలోకి తెస్తున్నారు. ఇందువల్ల, ఒకే ఐఎంఈఐ నంబరుతో పలు ఫోన్లు ఉన్నట్లు కనపడుతోంది. ఇకపై ఇలాంటి ఇబ్బందులను నివారించే వీలుంటుందని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని