బ్యాంకుల్లో బ్యాక్‌లాగ్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయండి

షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీలు) బ్యాక్‌లాగ్‌ ఉద్యోగ ఖాళీలను నిర్దిష్ట సమయంలోగా భర్తీ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు.

Published : 28 Sep 2022 02:15 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీలు) బ్యాక్‌లాగ్‌ ఉద్యోగ ఖాళీలను నిర్దిష్ట సమయంలోగా భర్తీ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. అన్ని పథకాల్లోనూ ఎస్సీల విస్తృతిని పెంచాలని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి నిమిత్తం తీసుకొచ్చిన వివిధ ప్రభుత్వ పథకాలపై మంత్రి సమీక్ష జరిపారు. పొరుగు సేవల కింద అప్పగించిన ఉద్యోగాలు ముఖ్యంగా సఫాయి కర్మచారి లాంటి ఉద్యోగాల వివరాలను అక్టోబరు 1 నుంచి డిజిటల్‌ రూపేణా భద్రపర్చాలని బ్యాంకులకు తెలిపారు. ఎస్సీ వర్గానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని ఫిర్యాదుల పరిష్కారానికి అక్టోబరు 2 నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉందని ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది.

రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ వేగవంతంపై దృష్టి పెట్టండి
ఆదాయపు పన్ను రిటర్న్‌లను వేగవంతంగా ప్రాసెస్‌ చేసి, రిఫండ్‌లు జారీ చేయడంపై ఆదాయపు పన్ను విభాగం అధికారులు దృష్టి సారించాలని నిర్మలా సీతారామన్‌ సూచించారు. ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకూ ప్రయత్నించాలని తెలిపారు. పరోక్ష పన్నుల వసూళ్లను ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మించాయని పేర్కొన్నారు. ఫేస్‌లెస్‌ మదింపు విధానం, సాంకేతికత వినియోగం వల్ల పన్ను అధికార్లపై, చెల్లింపుదార్లలో నెలకొన్న భయం తగ్గిందని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని