ఐఎల్‌ఖీఎఫ్‌ఎస్‌ ఛైర్మన్‌గా సి.ఎస్‌.రాజన్‌

రుణ పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డులో మార్పుచేర్పులను ప్రభుత్వం చేపట్టింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడిగా ఉన్న సి.ఎస్‌.రాజన్‌కు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదా కల్పించారు.

Published : 28 Sep 2022 02:15 IST

బోర్డులో మార్పు చేర్పులు

దిల్లీ: రుణ పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డులో మార్పుచేర్పులను ప్రభుత్వం చేపట్టింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడిగా ఉన్న సి.ఎస్‌.రాజన్‌కు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదా కల్పించారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నంద్‌ కిశోర్‌ మేనేజింగ్‌ డైరెక్టరుగా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది. పలు ఆర్థిక అవకతవకలు వెలుగు చూడటంతో 2018 అక్టోబరులో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అప్పటి బోర్డును కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ రద్దు చేసి, బోర్డులో కొత్త సభ్యులను నియమించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో 347 సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం 246 సంస్థలు దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. సుమారు నాలుగేళ్లుగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డుకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న ఉదయ్‌ కోటక్‌ పదవీ కాలం ఏప్రిల్‌ 2తో ముగిసింది. అప్పటి నుంచి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా రాజన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన హోదాను నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మార్పు చేసింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చి, 2023 మార్చి వరకు వర్తిస్తాయి. ప్రస్తుతం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బోర్డులో ఐదుగురు సభ్యులు- రాజన్‌, కిశోర్‌, జి.సి.చతుర్వేది, మాలిని శంకర్‌, ఎన్‌.శ్రీనివాసన్‌ ఉన్నారు. వీరిలో చతుర్వేది పదవీకాలం సెప్టెంబరు 30న ముగియనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని