200 విద్యుత్తు ఎయిర్‌ట్యాక్సీలు!

మహా నగరాల్లో కిక్కిరిసిన రోడ్లపై ప్రయాణం వల్ల గంటల తరబడి సమయం వృథా కావడంతో పాటు, వాహనాల పొగ వల్ల కాలుష్య ఉద్గారాలూ అధికమవుతున్నాయి.

Published : 28 Sep 2022 02:15 IST

బ్లేడ్‌ ఇండియాతో ఎంబ్రాయిర్‌ జట్టు

మహా నగరాల్లో కిక్కిరిసిన రోడ్లపై ప్రయాణం వల్ల గంటల తరబడి సమయం వృథా కావడంతో పాటు, వాహనాల పొగ వల్ల కాలుష్య ఉద్గారాలూ అధికమవుతున్నాయి. వీటిని నివారించేలా విద్యుత్తుతో నడిచే ఎయిర్‌ ట్యాక్సీల వంటి వెర్టికల్‌ టేకాఫ్‌, ల్యాండింగ్‌ (ఈవీటీఓఎల్‌)లను దేశీయంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. విమానాల మాదిరిగా రన్‌వేల అవసరం లేకుండా, హెలీకాప్టర్‌ మాదిరి నిలువుగా పైకి వెళ్లే, కిందకు దిగే వీలు ఈ వాహనాలకు ఉంటుంది. హంచ్‌ వెంచర్స్‌, బ్లేడ్‌ ఎయిర్‌ మొబిలిటీ సంయుక్త సంస్థ బ్లేడ్‌ ఇండియాతో విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్‌కు చెందిన ఈవ్‌ ఎయిర్‌ మొబిలిటీ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 200 ఈవీటీఓఎల్‌లు సరఫరా చేస్తారు. ప్రస్తుతం హెలికాప్టర్‌లు వినియోగిస్తున్న సంపన్నులను వీటిల్లోకి మళ్లించేలా, 3 నెలల ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ కోసం ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. భారత్‌లో ఈవ్‌ అర్బన్‌ ఎయిర్‌ మొబిలిటీ (యూఏఎం) వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బ్లేడ్‌ ఇండియా సహకారం అందించనుందని ఎండీ అమిత్‌ దత్తా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని