నిమిషానికి 1100 ఫోన్ల విక్రయం

ఇ కామర్స్‌ సంస్థల పండగ విక్రయాలు జోరుమీదున్నాయి. నిమిషానికి 1100 ఫోన్ల చొప్పున రూ.11,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను పెద్ద ఇ కామర్స్‌ సంస్థలు తొలి 4 రోజుల్లోనే (సెప్టెంబరు 22-25 తేదీల్లో)

Published : 28 Sep 2022 02:15 IST

4 రోజుల్లో ఇ-కామర్స్‌ సంస్థల అమ్మకాలు రూ.24,500 కోట్లు

ముంబయి: ఇ కామర్స్‌ సంస్థల పండగ విక్రయాలు జోరుమీదున్నాయి. నిమిషానికి 1100 ఫోన్ల చొప్పున రూ.11,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను పెద్ద ఇ కామర్స్‌ సంస్థలు తొలి 4 రోజుల్లోనే (సెప్టెంబరు 22-25 తేదీల్లో) విక్రయించినట్లు కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్‌ వెల్లడించింది. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు అధికంగా అమ్ముడవ్వడం, విలువ పెరిగేందుకు దోహద పడింది. ఇదే సమయంలో సంస్థల మొత్తం అమ్మకాలు రూ.24,500 కోట్ల (3.5 బిలియన్‌ డాలర్ల)కు చేరినట్లు తెలిపింది. గత ఏడాది పండగ సీజన్‌ (దీపావళి పూర్తయ్యేవరకు) విక్రయాల మొత్తంలో ఇవి 59 శాతానికి సమానం. అంటే ఈసారి ఎంతటి స్పందన వచ్చిందో అర్థమవుతోందని వివరించింది. పండగ సీజన్‌ తొలి దశ (ప్రస్తుతం జరుగుతోంది)లో రూ.41,000 కోట్ల అమ్మకాలు నమోదు కావచ్చన్నది రెడ్‌సీర్‌ అంచనా.
అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌తో పాటు, రిలయన్స్‌ జియోమార్ట్‌- అ జియో, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, మీషో వంటి ఇతర సంస్థలూ ఆన్‌లైన్‌ విక్రయాలు చేపట్టాయి.

* ఫ్యాషన్‌ ఉత్పత్తుల విక్రయాల విలువ సాధారణ రోజులతో పోలిస్తే 4.5 రెట్లు పెరిగి రూ.5,500 కోట్లకు చేరాయి.

* 60-70 లక్షల మొబైల్‌ ఫోన్లు 4 రోజుల్లోనే విక్రయం కాగా, వారంరోజుల అమ్మకాల్లో ఈ సంఖ్య 90 లక్షల నుంచి కోటికి చేరొచ్చన్నది సంస్థ అంచనా.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts