టాటా టియోగో ఈవీ జీ 8.49 లక్షలు

టాటా మోటార్స్‌ దేశీయ విపణిలోకి టియాగో విద్యుత్‌ కారు (ఈవీ)ను విడుదల చేసింది.  19.2 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం బ్యాటరీ కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 25 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం బ్యాటరీ కలిగిన

Published : 29 Sep 2022 02:28 IST

ముంబయి: టాటా మోటార్స్‌ దేశీయ విపణిలోకి టియాగో విద్యుత్‌ కారు (ఈవీ)ను విడుదల చేసింది.  19.2 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం బ్యాటరీ కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 25 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం బ్యాటరీ కలిగిన కారు ధర రూ.9.09 లక్షల నుంచి మొదలవుతుంది. తొలి 10,000 మంది వినియోగదార్లకే ఈ ధర అని సంస్థ పేర్కొంది. ఆ తర్వాత ధర ఎంత ఉంటుందనేది వెల్లడించలేదు. అక్టోబరు 10న వీటి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, 2023  జనవరి నుంచి డెలివరీ ప్రారంభిస్తామంది.

ఒక ఛార్జింగ్‌తో 19.2 కిలోవాట్‌ బ్యాటరీ కారు 250 కి.మీ. వరకు, 25 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ కారు  315 కి.మీ. వరకు ప్రయాణిస్తుందని పేర్కొంది.

5 ఏళ్లలో మరో 10 కార్లు: ఈ దశాబ్దం ఆఖరుకు తమ మొత్తం విక్రయాల్లో 30 శాతం ఈవీలే ఉంటాయని టాటా మోటార్స్‌ పేర్కొంది. వచ్చే 5 ఏళ్లలో మరో 10 కొత్త ఉత్పత్తులను తీసుకొస్తామని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాల ఎండీ శైలేష్‌ చంద్ర వెల్లడించారు. ప్రతినెలా నెక్సాన్‌ ఈవీలు 3000-3500, టిగోర్‌ ఈవీలు 1000-1300 చొప్పున విక్రయిస్తున్నామని, ఈ ఏడాదిలో మొత్తం ఈవీల విక్రయాలు 50,000కు చేరొచ్చని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని