40 ఏళ్లలోపు కుబేరుల్లో జెరోధా నిఖిల్‌ కామత్‌కు అగ్రస్థానం

నాలుగు పదుల వయసులోపే, స్వయంకృషితో కుబేరులుగా ఎదిగిన వ్యాపారవేత్తల జాబితాను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌, హురున్‌ ఇండియా రూపొందించాయి. ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా 40 అండ్‌ అండర్‌ సెల్ఫ్‌ మేడ్‌ రిచ్‌ లిస్ట్‌ 2022’ పేరిట ఈ

Published : 29 Sep 2022 02:31 IST

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌, హురున్‌ జాబితా

దిల్లీ: నాలుగు పదుల వయసులోపే, స్వయంకృషితో కుబేరులుగా ఎదిగిన వ్యాపారవేత్తల జాబితాను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌, హురున్‌ ఇండియా రూపొందించాయి. ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా 40 అండ్‌ అండర్‌ సెల్ఫ్‌ మేడ్‌ రిచ్‌ లిస్ట్‌ 2022’ పేరిట ఈ జాబితాను విడుదల చేశాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహవ్యవస్థాపకుడైన నిఖిల్‌ కామత్‌ రూ.17,500 కోట్ల నికర సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఓలా వ్యవస్థాపకుడు భవిశ్‌ అగర్వాల్‌ (రూ.11,700 కోట్లు), మీడియా.నెట్‌కు చెందిన దివ్యాంక్‌ తురాఖియా (రూ.11,200) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. 40 ఏళ్ల లోపు వయసు, రూ.1000 కోట్ల సంపద కలిగిన వారితో ఈ జాబితా రూపొందించారు. ఈ ఏడాది కొత్తగా 15 మంది చోటు దక్కించుకోగా.. అందరూ అంకుర సంస్థల వ్యవస్థాపకులే.

జాబితాలో పిన్న వయస్కుడిగా ఇన్‌స్టంట్‌ గ్రోసరీ యాప్‌ జెప్టో సహవ్యవస్థాపకులు కైవల్య వోహ్ర నిలిచారు. ఆయన వయసు 19 ఏళ్లు మాత్రమే.

పిన్న వయస్కురాలిగా కాన్‌ఫ్లుయెంట్‌ సహవ్యవస్థాపకురాలు నేహా నర్ఖెడె (37)ఉన్నారు. రూ.4,700 కోట్ల సంపదతో ఆమె 10వ స్థానం దక్కించుకున్నారు.

ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకులు అలఖ్‌ పాండే, ప్రతీక్‌ మహేశ్వరి తొలిసారి జాబితాలో చోటు పొందారు. 11వ స్థానంలో ఉన్న వీరికి తలో రూ.4000 కోట్ల వ్యక్తిగత సంపద ఉంది.

యువ కుబేరుల్లో 14 మంది బెంగళూరుకు చెందిన వారు ఉన్నారు. దిల్లీ, ముంబయి నుంచి చెరో 8 మంది స్థానం పొందారు.

జాబితాలోని కుబేరుల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి చెంది రూ.1,83,700 కోట్లకు చేరింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని