రాబోయే ఆరు నెలల్లో రూ.5.92 లక్షల కోట్ల రుణం!

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం (అక్టోబరు నుంచి మార్చి వరకు)లో రూ.5.92 లక్షల కోట్ల రుణాలు తీసుకోనుంది.  ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.14.31 లక్షల కోట్ల రుణం అవసరమవుతుందని కేంద్ర ఆర్థికశాఖ తొలుత అంచనా వేసింది. కానీ అంతిమంగా రూ.14.21 లక్షల కోట్ల రుణం తీసుకోవాలని

Published : 30 Sep 2022 03:04 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం (అక్టోబరు నుంచి మార్చి వరకు)లో రూ.5.92 లక్షల కోట్ల రుణాలు తీసుకోనుంది.  ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.14.31 లక్షల కోట్ల రుణం అవసరమవుతుందని కేంద్ర ఆర్థికశాఖ తొలుత అంచనా వేసింది. కానీ అంతిమంగా రూ.14.21 లక్షల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. దాని ప్రకారం ఇప్పటివరకు తీసుకున్న రుణం పోను మిగిలింది, వచ్చే ఆరునెలల్లో తీసుకోనుంది. సార్వభౌమ హరిత బాండ్ల ద్వారా రూ.16వేల కోట్లు సేకరిస్తుంది. మరో రూ.5.76 లక్షల కోట్లను 20 వారాలపాటు నిర్వహించే సెక్యూరిటీల వేలం ద్వారా మార్కెట్‌ నుంచి తీసుకుంటుంది. ఇందుకోసం 2, 5, 7, 10, 14, 30, 40 ఏళ్ల కాలానికి సెక్యూరిటీలు వేలం వేస్తారు. తాత్కాలికంగా ఏర్పడే ఆర్థిక వనరుల కొరత నివారణ కోసం రిజర్వ్‌బ్యాంక్‌ వచ్చే 6 నెలల కాలానికి వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద రూ.50వేల కోట్లు తీసుకోడానికి అనుమతి ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని