హైబ్రిడ్‌ పని విధానంతోఉద్యోగులు, నాయకుల మధ్య అంతరాలు

హైబ్రిడ్‌ పని విధానం వల్ల సంస్థల్లో ఉద్యోగులు, నాయకుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని మైక్రోసాఫ్ట్‌ సర్వే వెల్లడించింది. కార్యాలయాలకు వెళ్లడానికి సరైన కారణాల కోసం 80 శాతం మంది ఉద్యోగులు చూస్తున్నారని, ఉద్యోగుల ఉత్పాదకతపై విశ్వాసం ఉంచడం కష్టంగా ఉందని 91 శాతం మంది నాయకులు అభిప్రాయపడ్డారు.

Published : 30 Sep 2022 03:20 IST

మైక్రోసాఫ్ట్‌ సర్వే

దిల్లీ: హైబ్రిడ్‌ పని విధానం వల్ల సంస్థల్లో ఉద్యోగులు, నాయకుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని మైక్రోసాఫ్ట్‌ సర్వే వెల్లడించింది. కార్యాలయాలకు వెళ్లడానికి సరైన కారణాల కోసం 80 శాతం మంది ఉద్యోగులు చూస్తున్నారని, ఉద్యోగుల ఉత్పాదకతపై విశ్వాసం ఉంచడం కష్టంగా ఉందని 91 శాతం మంది నాయకులు అభిప్రాయపడ్డారు. 11 దేశాల్లో 20,000 మందికి పైగా పూర్తిస్థాయి ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఈ సర్వేలో పాల్గొన్నారు. జులై 7 నుంచి ఆగస్టు 2 మధ్య ఈ సర్వే చేపట్టారు. భారత్‌ నుంచి 2000 మంది అభిప్రాయాలు తెలిపారు. సహ ఉద్యోగులతో కలిసి పనిచేయగలిగితే, కార్యాలయాలకు వెళ్లడానికి 91 శాతం మంది భారత ఉద్యోగులు సంసిద్ధత వ్యక్తం చేశారు.

* భారత్‌లో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడం ఇబ్బందిగా ఉందని 93 శాతం మంది నాయకులు వెల్లడించారు. ఒకరి కోసం మరొకరు రావడానికి మాత్రమే ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారు. కంపెనీ అంచనాలను పక్కన పెడితే కార్యాలయాలకు వెళ్లడానికి సరైన కారణం అవసరమని 80 శాతం ఉద్యోగులు చెబుతున్నారు. పనిలో పూర్తిగా అలిసిపోయామని 47 శాతం మంది భారత ఉద్యోగులు, 58 శాతం నాయకులు తెలిపారు.

* కరోనా మహమ్మారి తర్వాత భారత్‌లో ఎక్కువ శాతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు హైబ్రిడ్‌ పని విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం భారత ఐటీ కంపెనీల్లో సిబ్బంది వలసల రేటు 20 శాతంగా నమోదవుతోంది.

* కంపెనీలు తరచు మారితేనే నైపుణ్యాలు పెంచుకోగలమని 66 శాతం మంది ఉద్యోగులు తెలిపారు. తాము నైపుణ్యాలు నేర్చుకుని, ఉన్నత స్థాయికి చేరే వీలుంటే, ప్రస్తుత కంపెనీలోనే కొనసాగుతామని 90 శాతం మంది పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని