కారు విక్రయాల్లో భారత్‌ దూకుడు

చిప్‌ కొరత తీరుతున్నందున, ప్రస్తుత పండగ సీజనులో భారత వాహన పరిశ్రమ తన ప్రాంతీయ, అంతర్జాతీయ పోటీదార్ల కంటే మెరుగ్గా కార్ల విక్రయాలను సాధించొచ్చని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ పేర్కొంది. సానుకూల సంకేతాల కారణంగా దేశంలో కార్ల అమ్మకాలు ఈ సంవత్సరం 12.5 శాతం మేర, వచ్చే ఏడాది మరో

Published : 30 Sep 2022 03:04 IST

ప్రాంతీయంగా, అంతర్జాతీయంగానూ మెరుగు

మూడీస్‌ అంచనాలు

చిప్‌ కొరత తీరుతున్నందున, ప్రస్తుత పండగ సీజనులో భారత వాహన పరిశ్రమ తన ప్రాంతీయ, అంతర్జాతీయ పోటీదార్ల కంటే మెరుగ్గా కార్ల విక్రయాలను సాధించొచ్చని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ పేర్కొంది. సానుకూల సంకేతాల కారణంగా దేశంలో కార్ల అమ్మకాలు ఈ సంవత్సరం 12.5 శాతం మేర, వచ్చే ఏడాది మరో 4 శాతం మేర వృద్ధి సాధించొచ్చని అంచనా వేసింది. ‘కార్ల అమ్మకాల్లో ఈ ఏడాదిలో భారత్‌ వెలిగిపోతోంది. 2022లో ఇప్పటిదాకా అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుత పండగల కారణంగా మరింత రాణించొచ్చ’ని తాజా నివేదికలో పేర్కొంది. స్థూల ఆర్థిక వాతావరణం బలంగా ఉండడం; సెమీకండక్టర్‌ కొరత తీరుతుండడంతో ఇది సాధ్యం కావొచ్చని పేర్కొంది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద వాహన మార్కెట్‌ అయిన చైనాలో ఈ ఏడాది వాహన అమ్మకాలు 4%  మాత్రమే పెరగొచ్చు. 2023లో 3.5 శాతం వృద్ధి కనిపించొచ్చు. 2023 కల్లా చైనా, భారత్‌లలో వాహన అమ్మకాలు 2018 నాటి స్థాయికి చేరొచ్చు. జపాన్‌లో మాత్రం రికవరీకి సమయం పట్టొచ్చ’ని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని