ద్రవ్యలోటు రూ.5.41 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు ద్రవ్యలోటు రూ.5,41,601 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యం (రూ.16.61 లక్షల కోట్ల)లో ఇది 32.6 శాతానికి సమానం. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

Published : 01 Oct 2022 02:25 IST

వార్షిక లక్ష్యంలో 32.6 శాతానికి

ఏప్రిల్‌-ఆగస్టులోనే

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు ద్రవ్యలోటు రూ.5,41,601 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యం (రూ.16.61 లక్షల కోట్ల)లో ఇది 32.6 శాతానికి సమానం. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ మొత్తం వసూళ్లు (పన్నులు సహా) రూ.8.48 లక్షల కోట్లు లేదా బడ్జెట్‌ అంచనా (2022-23)ల్లో 37.2 శాతంగా ఉన్నాయి. 2021-22 ఇదే సమయానికి వసూళ్లు బడ్జెట్‌ అంచనాల్లో 40.9 శాతంగా ఉన్నాయి. సమీక్షా కాలంలో పన్ను ఆదాయాలు రూ.7 లక్షల కోట్లు లేదా ఈ ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో 36.2 శాతంగా నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయాలు రూ.13.9 లక్షల కోట్లు లేదా 2022-23 బడ్జెట్‌ అంచనాల్లో 35.2 శాతంగా నమోదయ్యాయి. 2021-22 ఇదే సమయానికి బడ్జెట్‌ అంచనాల్లో ఇవి 36.7 శాతంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతానికి పరిమితం కావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.

9 నెలల కనిష్ఠానికి కీలక రంగాల వృద్ధి

దిల్లీ: ఎనిమిది కీలక మౌలిక వసతుల రంగాల ఉత్పత్తి ఆగస్టులో 3.3 శాతం వృద్ధి చెందింది. ఇది తొమ్మిది నెలల కనిష్ఠ స్థాయి. 2021 ఆగస్టులో 12.2 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం కనిష్ఠ స్థాయి 2021 నవంబరులో నమోదైన 3.2 శాతమే. ఈ ఏడాది జులైలో కూడా వృద్ధి 4.5 శాతం కావడం గమనార్హం.

* ఆగస్టులో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి వరుసగా 3.3%, 0.9% చొప్పున క్షీణించాయి. * ఎరువుల ఉత్పత్తి 11.9 శాతం రాణించింది. * బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంటు, విద్యుదుత్పత్తి వృద్ధి రేట్లు వరుసగా 7.6%, 7%, 2.2%, 1.8%, 0.9 శాతానికి పరిమితమయ్యాయి.

ఏప్రిల్‌-ఆగస్టులో..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఆగస్టులో 8 కీలక రంగాల (బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్‌) ఉత్పత్తిలో వృద్ధి 9.8 శాతంగా నమోదైంది. 2021 ఇదే అయిదు నెలల్లో నమోదైన 19.4 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని