ద్రవ్యోల్బణం ఫరవాలేదు

దేశంలో ద్రవ్యోల్బణం నిర్వహించదగిన స్థాయిలోనే ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఇటీవలి సమీక్ష ద్వారా మార్కెట్లకు సానుకూల సందేశాన్ని పంపిందని వివరించారు. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) 6వ వార్షికోత్సవంలో మంత్రి ప్రసంగించారు.

Published : 02 Oct 2022 02:13 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం నిర్వహించదగిన స్థాయిలోనే ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఇటీవలి సమీక్ష ద్వారా మార్కెట్లకు సానుకూల సందేశాన్ని పంపిందని వివరించారు. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) 6వ వార్షికోత్సవంలో మంత్రి ప్రసంగించారు. ప్రపంచ దేశాలకు మనదేశమే అత్యంత ఆకర్షణీయంగా ఉందని, పెట్టుబడిదార్ల నుంచీ ఆసక్తి వ్యక్తమవుతోందని చెప్పారు. దేశంలో ఔత్సాహికవేత్తలకు అపార అవకాశాలు రాబోతున్నాయని, ఇందువల్ల పెట్టుబడులూ తరలి వస్తాయని పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు లిక్విడేషన్, దివాలా స్మృతి వ్యవహారాలను సమర్థంగా అర్థం చేసుకుని, కార్యకలాపాలు నిర్వహించే వృత్తి నిపుణుల అవసరం ఎంతో ఉందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నియంత్రణ సంస్థలను మరింత సమర్థంగా నిర్వహించాలని తెలిపారు. విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి నేపథ్యంలో, దేశంలో విలీనాలు - కొనుగోళ్లు చోటుచేసుకోవచ్చని పేర్కొన్నారు. విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు జులైలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారని, ఆగస్టు నుంచి వారు మళ్లీ మన మార్కెట్లలోనే పెట్టుబడులు పెడుతున్నారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మన దేశంపై ఉన్న ఆసక్తిని ఇది నిరూపిస్తోందని మంత్రి విశదీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని