రైల్‌వైర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదార్లు రైల్‌టెల్‌ వై-ఫై వాడొచ్చు

రైల్‌వైర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదార్లు ఇకపై రైల్వేస్టేషన్లలో ప్రత్యేకంగా ప్రీ-పెయిడ్‌ వై-ఫై ప్లాన్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. రైల్‌వైర్‌ ఎఫ్‌టీటీహెచ్‌ (ఫైబర్‌ టు హోమ్‌) ద్వారా తీసుకున్న ఇంటి బ్రాడ్‌బ్యాండ్‌ పథకాన్ని రైల్‌టెల్‌ వై-ఫై నెట్‌వర్క్‌కు కూడా ఉపయోగించుకోవచ్చని రైల్‌టెల్‌ తెలిపింది.

Published : 02 Oct 2022 02:14 IST

దేశవ్యాప్తంగా 6105 రైల్వేస్టేషన్లలో

దిల్లీ: రైల్‌వైర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదార్లు ఇకపై రైల్వేస్టేషన్లలో ప్రత్యేకంగా ప్రీ-పెయిడ్‌ వై-ఫై ప్లాన్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. రైల్‌వైర్‌ ఎఫ్‌టీటీహెచ్‌ (ఫైబర్‌ టు హోమ్‌) ద్వారా తీసుకున్న ఇంటి బ్రాడ్‌బ్యాండ్‌ పథకాన్ని రైల్‌టెల్‌ వై-ఫై నెట్‌వర్క్‌కు కూడా ఉపయోగించుకోవచ్చని రైల్‌టెల్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా 6,105 రైల్వేస్టేషన్లలో ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం వినియోగదార్లు వారి స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫైను ఆన్‌చేసి రైల్‌వైర్‌ ఎస్‌ఎస్‌ఐడీని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత రైల్‌వైర్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌కోసం లాగిన్‌ స్క్రీన్‌పైన ఇచ్చిన హైపర్‌ లింక్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. ‘రైల్‌టెల్‌ వై-ఫై దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ఉంది. అంతర్జాతీయంగా అతిపెద్ద అనుసంధానిత పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌ల్లో ఇది ఒకటి. రోజూ 10 లక్షల మందికి పైగా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైల్‌వైర్‌కు 4.82 లక్షల మంది చందాదార్లు ఉన్నారు. ఈ సంఖ్య పెరుగుతోంద’ని రైల్‌టెల్‌ తెలిపింది. ఓటీటీతో కూడిన రైల్‌వైర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ పథకం నెలకు రూ.499 ధరతో ప్రారంభం అవుతుంది. దీని ద్వారా 14 ఓటీటీ సేవలు పొందొచ్చు. దేశవ్యాప్తంగా అత్యంత చౌక పథకాల్లో ఇది ఒకటి. రైల్‌వైర్‌ ఇంటర్నెట్‌ సదుపాయం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఉంది. దీనికి 50 శాతానికి పైగా చందాదార్లు చిన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్లే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని