కుటుంబ సమేతంగా యాత్రలకు

కొవిడ్‌-19 పరిణామాల నుంచి దేశం పూర్తిగా కోలుకుంటున్న నేపథ్యంలో, తమ కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లేందుకు 30-40 ఏళ్లవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు బిజినెస్‌ ఆఫ్‌ ట్రావెల్‌ ట్రేడ్‌ (బీఓటీటీ) నివేదిక వెల్లడించింది.

Published : 02 Oct 2022 02:18 IST

బిజినెస్‌ ఆఫ్‌ ట్రావెల్‌ ట్రేడ్‌ నివేదిక

ముంబయి: కొవిడ్‌-19 పరిణామాల నుంచి దేశం పూర్తిగా కోలుకుంటున్న నేపథ్యంలో, తమ కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లేందుకు 30-40 ఏళ్లవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు బిజినెస్‌ ఆఫ్‌ ట్రావెల్‌ ట్రేడ్‌ (బీఓటీటీ) నివేదిక వెల్లడించింది. 82 శాతం మంది భారతీయ మిలీనియల్‌ ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లాలనుకుంటున్నట్లు నివేదికలో తేలింది. దేశ వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 15 మధ్య 8,500 మంది మిలీనియల్‌ ప్రయాణికులను సర్వే చేసి బీఓటీటీ ఈ నివేదికను రూపొందించింది. 1980-90 మధ్యలో జన్మించిన వారిని జనరేషన్‌ వై లేదా మిలీనియల్స్‌ అంటుంటారు. నివేదిక ప్రకారం..

* కొవిడ్‌ పరిణామాల నుంచి తేరుకున్నందున, విహార యాత్రకు వెళ్లేందుకు మిలీనియల్స్‌ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. 56 శాతం మంది అంతర్జాతీయ విహారానికి మొగ్గు చూపుతున్నారు. 44 శాతం మంది దేశీయంగా పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.

* సెలవులున్నప్పుడు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని 82 శాతానికి పైగా మిలీనియల్‌ ప్రయాణికులు ప్రణాళిక సిద్ధం చేసుకోవడంతో ప్రయాణ, పర్యాటక రంగాలకు మేలు చేసే అంశమే.

* 42 శాతం మంది మిలీనియల్స్‌ రూ.2-5 లక్షలు, 33 శాతం మంది రూ.5-10 లక్షల మధ్య విహార యాత్రలకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

* సుమారు 31 శాతం మంది మిలీనియల్స్‌ విలాస హోటళ్లను బుక్‌ చేయడానికి సిద్ధమయ్యారు. బడ్జెట్‌ హోటళ్లలో గదులు బుకింగ్‌ చేస్తామని 27 శాతం మంది, బొటిక్‌ ప్రోపర్టీస్‌పై 26 శాతం మంది ఆసక్తిగా ఉన్నారు.

* కొవిడ్‌ ప్రభావంతో దాదాపు రెండేళ్లపాటు ప్రయాణ, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. తాజా సర్వేలో వెల్లడైన విషయాలు ఆయా రంగాలకు భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచి, వాటిని ప్రోత్సహించే విధంగా ఉన్నాయని టీబీఓ గ్రూప్‌ (ట్రావెల్‌ బొటిక్‌ ఆన్‌లైన్‌) సహ వ్యవస్థాపకులు అంకుశ్‌ నిజ్హవాన్‌ వెల్లడించారు. ప్రయాణాలకు గిరాకీ పెరిగినట్లు ఇది సూచిస్తోందని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని