చమురు కిందకు!

పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈ వారం రాణించాలంటే నిరోధ స్థాయైన రూ.50,379ను అధిగమించాలి. అది జరిగితే రూ.50,778; రూ.51,167 వరకు పెరుగుతుందని భావించవచ్చు. అదే సమయంలో రూ.49,688 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకూ మొగ్గు చూపొచ్చు.

Published : 03 Oct 2022 02:18 IST

కమొడిటీస్‌
ఈ వారం


బంగారం

సిడి డిసెంబరు కాంట్రాక్టు ఈ వారం రాణించాలంటే నిరోధ స్థాయైన రూ.50,379ను అధిగమించాలి. అది జరిగితే రూ.50,778; రూ.51,167 వరకు పెరుగుతుందని భావించవచ్చు. అదే సమయంలో రూ.49,688 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకూ మొగ్గు చూపొచ్చు. అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలు, ఇతరత్రా అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈవారం పసిడి కాంట్రాక్టుకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ అక్టోబరు కాంట్రాక్టును ఈ వారం రూ.14,046 లక్ష్యంతో.. రూ.13,604 దిగువన కొనుగోలు చేయడం మంచిదే. అయితే రూ.13,339 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.


వెండి

వెండి డిసెంబరు కాంట్రాక్టు ఈ వారం రూ.55,064 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే లాంగ్‌ పొజిషన్లను తీసుకోవడం మంచిదే. ఒకవేళ కిందకు వచ్చినా రూ.55,026 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.53,195కి పడిపోయే అవకాశం ఉంటుంది.


ప్రాథమిక లోహాలు

* రాగి అక్టోబరు కాంట్రాక్టు ఈ వారం రూ.651 కంటే పైన కదలాడితే మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. రూ.661; రూ.671 వరకు పెరగొచ్చు. అదే విధంగా రూ.653 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ రూ.650 సమీపంలో షార్ట్‌ సెల్‌ చేయడమూ మంచి వ్యూహమే అవుతుంది.

* సీసం అక్టోబరు కాంట్రాక్టు ఈ వారం రూ.179.65 కంటే పైన చలిస్తే.. మరింతగా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో రూ.176 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని లాంగ్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు.

* జింక్‌ అక్టోబరు కాంట్రాక్టు ఈవారం బలహీనంగా కన్పిస్తోంది. రూ.273 ఎగువన చలించకుంటే.. షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.

* అల్యూమినియం అక్టోబరు కాంట్రాక్టు ఈ వారం రూ.190 దిగువన కదలాడకుంటే.. కొంత రాణింపునకు ఆస్కారం ఉంది. ఈ స్థాయి కంటే కింద చలిస్తే అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు.


ఇంధన రంగం

* ముడి చమురు అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.6,813 కంటే పైన కదలాడకుంటే.. ప్రస్తుత షార్ట్‌సెల్‌ పొజిషన్లు కొనసాగించడం మంచిదే. రూ.6,400; రూ.6,216 స్థాయిలకు దిగివచ్చే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.

* సహజవాయువు అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.631 కంటే పైన కదలాడకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రూ.631ను మించితే.. రూ.661 వరకు పెరిగే అవకాశం ఉంది.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు అక్టోబరు కాంట్రాక్టు ఈ వారం రూ.7,045 కంటే దిగువన కదలాడకుంటే రూ.7,472 వరకు పెరుగుతుందని భావించవచ్చు.

* జీలకర్ర అక్టోబరు కాంట్రాక్టు ఈ వారం రూ.25,465 ఎగువన షార్ట్‌ సెల్లింగ్‌కు దూరంగా ఉండాలి.

* ధనియాలు అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.10,383 కంటే దిగువన కదలాడితే మరింతగా పడిపోయే అవకాశం ఉంది.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని