హెచ్‌సీఎల్‌ టెక్‌లో 1000 ఉద్యోగాలు

వచ్చే రెండేళ్లలో బ్రెజిల్‌లో 1,000 మందిని నియమించుకోవాలని ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రణాళికలు రచిస్తోంది. అదే సమయంలో కాంపినాస్‌లో ఒక కొత్త టెక్నాలజీ సెంటర్‌ను సైతం తెరవనుంది.

Published : 05 Oct 2022 02:32 IST

దిల్లీ: వచ్చే రెండేళ్లలో బ్రెజిల్‌లో 1,000 మందిని నియమించుకోవాలని ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రణాళికలు రచిస్తోంది. అదే సమయంలో కాంపినాస్‌లో ఒక కొత్త టెక్నాలజీ సెంటర్‌ను సైతం తెరవనుంది. స్థానిక, అంతర్జాతీయ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా తన కార్యకలాపాలు హెచ్‌సీఎల్‌ టెక్‌ పెంచుకుంటోంది. ‘మా దీర్ఘకాల వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగానే బ్రెజిల్‌లో కార్యకలాపాలు పెంచుతున్నాం. ఇక్కడున్న మా క్లయింట్లు, భాగస్వాములు, ప్రజల వృద్ధికి ప్రాధాన్యతనిస్తామ’ని హెచ్‌సీఎల్‌ టెక్‌ చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ అనిల్‌ గంజూ పేర్కొన్నారు. వరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని