భారత్‌లో 5జీ సేవలతో టెక్నాలజీ మరింత విస్తరణ

భారత్‌లో 5జీ సేవల ప్రారంభంతో సాంకేతికత మరింతగా విస్తరిస్తుందని.. లాటిన్‌ అమెరికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు....

Updated : 05 Oct 2022 02:38 IST

క్వాల్‌కామ్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ క్రిస్టియానో

దిల్లీ: భారత్‌లో 5జీ సేవల ప్రారంభంతో సాంకేతికత మరింతగా విస్తరిస్తుందని.. లాటిన్‌ అమెరికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కూడా ఇది ఉత్ప్రేరకంగా పని చేస్తుందని చిప్‌సెట్‌ దిగ్గజ సంస్థ క్వాల్‌కామ్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ క్రిస్టియానో అమోన్‌ వెల్లడించారు. 5జీ సాంకేతికత ప్రారంభంతో 5జీ పరికరాలకు కూడా మద్దతు పెరుగుతుందని, వివిధ ధరల వద్ద ఇవి అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. 5జీ అభివృద్ధితో అనేక ముఖ్యమైన అవకాశాలు లభిస్తాయని రౌండ్‌ టేబుల్‌ చర్చలో ఆయన వెల్లడించారు. 5జీ రాకతో అమెరికాకు చెందిన ఈ సెమీకండక్టర్‌ దిగ్గజం తమ వ్యాపారాన్ని వైవిధ్యీరిస్తోంది. కమ్యూనికేషన్స్‌ కంపెనీ నుంచి మొబైల్‌ పరిశ్రమ, ప్రాసెసర్‌ కంపెనీ, ఆటోమొబైల్‌, వ్యక్తిగత కంప్యూటర్లు, పారిశ్రామిక సాంకేతిక రంగాలకు అవసరమైన టెక్నాలజీపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ఎలక్ట్రానిక్‌ చిప్‌లకు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ముఖ్య భూమిక పోషిస్తుందని, బోలెడన్ని అవకాశాలు లభిస్తాయని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు