సోనీ-జీ గ్రూప్‌ మెగా విలీనానికి సీసీఐ అనుమతి

మీడియా గ్రూప్‌లు సోనీ, జీ మెగా విలీన ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) మంగళవారం కొన్ని షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది.

Published : 05 Oct 2022 02:37 IST

దిల్లీ: మీడియా గ్రూప్‌లు సోనీ, జీ మెగా విలీన ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) మంగళవారం కొన్ని షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. ఒప్పందంలో కొన్ని మార్పులు సూచించి ఒప్పందానికి ఆమోదం తెలిపినట్లు సీసీఐ ట్వీట్‌ చేసింది. గత ఏడాది సెప్టెంబరులో ఈ విలీన ప్రతిపాదన తెరమీదకొచ్చింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీ), బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.లను కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. (సీఎంఈ)లో విలీనం చేసేందుకు కొన్ని మార్పులతో ఆమోదం తెలిపినట్లు సీసీఐ వెల్లడించింది. కాంపిటీషన్‌ చట్టానికి విరుద్ధంగా ఒప్పందం ఉన్నట్లు గుర్తించిన సీసీఐ తొలుత షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా, ఇరు పార్టీలు స్వచ్ఛంద నివారణోపాయాలను ప్రతిపాదించాయి. వీటిని సీసీఐ ఆమోదించి మెగా విలీనానికి అనుమతి ఇచ్చింది. మార్కెట్‌లో సరైన పోటీ ఉండేలా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు సీసీఐ అనుమతి పొందడం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు