భారత వృద్ధి 6.5 శాతమే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించిన సంస్థల జాబితాలో ప్రపంచ బ్యాంకూ చేరింది. వృద్ధిరేటు 7.5 శాతం ఉండొచ్చని గత జూన్‌లో అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్‌.. తాజా నివేదికలో 1 శాతం తగ్గించి 6.5 శాతానికి పరిమితం చేసింది.

Published : 07 Oct 2022 02:09 IST

ప్రపంచ బ్యాంక్‌ అంచనాల్లో కోత

వాషింగ్టన్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించిన సంస్థల జాబితాలో ప్రపంచ బ్యాంకూ చేరింది. వృద్ధిరేటు 7.5 శాతం ఉండొచ్చని గత జూన్‌లో అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్‌.. తాజా నివేదికలో 1 శాతం తగ్గించి 6.5 శాతానికి పరిమితం చేసింది. అయితే దక్షిణాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ బలంగా పుంజుకుంటోందని తెలిపింది. కొవిడ్‌-19 మొదటి దశలో ఆర్థిక వ్యవస్థ గణనీయంగా క్షీణించినా.. తదుపరి బలంగా పుంజుకుని, మెరుగైన పనితీరును కనబరుస్తోందని వరల్డ్‌ బ్యాంక్‌ ముఖ్య ఆర్థికవేత్త (దక్షిణాసియా) హన్స్‌ టిమ్మర్‌ చెప్పారు. ఆయన ప్రకారం..

* సానుకూలం: విదేశీ రుణాలు మరీ ఎక్కువగా లేకపోవడం, సేవల రంగం ఆకర్షణీయంగా రాణిస్తుండటం, విదేశీ మారకపు నిల్వలు అధికంగా ఉండటం, పరపతి విధాన నిర్ణయాలు భారత్‌కు కలిసొస్తున్న అంశాలు.

* ప్రతికూలం: అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడం, కీలక రేట్ల పెంపు వల్ల వర్థమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వడ్డీరేట్లను పెంచడం వల్ల పెట్టుబడులు భారమై, ప్రతికూలంగా మారతాయి.

* భారత్‌ నుంచి గోధుమల ఎగుమతుపై నిషేధం, బియ్యం ఎగుమతిపై అధిక టారిఫ్‌లు విధించడం మిగిలిన ప్రపంచంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

* భారత్‌లో వృద్ధి ఫలాలు కొద్దిమందికే పరిమితం అవుతున్నాయి. అందరికీ అందినప్పుడే ఆర్థిక వ్యవస్థకు మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని