Reliance industries: మెట్రో భారత్‌ వ్యాపారం రిలయన్స్‌కే?

దేశీయ రిటైల్‌ రంగ వ్యాపారంలో మరింత బలోపేతం అయ్యేందుకు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) దూకుడు పెంచుతోంది. జర్మనీ సంస్థ మెట్రో ఏజీ భారత్‌లో నిర్వహిస్తున్న టోకు వ్యాపారాన్ని చేజిక్కించుకునే దిశగా ఆర్‌ఐఎల్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 14 Oct 2022 09:29 IST

లావాదేవీ విలువ 1- 1.2 బి.డాలర్లు

దిల్లీ: దేశీయ రిటైల్‌ రంగ వ్యాపారంలో మరింత బలోపేతం అయ్యేందుకు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) దూకుడు పెంచుతోంది. జర్మనీ సంస్థ మెట్రో ఏజీ భారత్‌లో నిర్వహిస్తున్న టోకు వ్యాపారాన్ని చేజిక్కించుకునే దిశగా ఆర్‌ఐఎల్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చల్లో మెరుగైన పురోగతి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మెట్రో భారత్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసే రేసులో ఆర్‌ఐఎల్‌ ఒక్కటే ఉన్నట్లు సమాచారం. థాయ్‌లాండ్‌కు చెందిన సీపీ గ్రూపు కూడా మెట్రో వ్యాపారం కోసం తొలుత పోటీపడినా, తదుపరి చర్చలకు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెట్రో ఏజీ వ్యాపారంపై తుది నిర్ణయం వచ్చే నెల ప్రారంభంలో వెలువడొచ్చని పేర్కొన్నాయి. మెట్రో ఏజీ భారత్‌ వ్యాపారం విలువ 1- 1.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8200- 9840 కోట్లు)గా ఉండే అవకాశం ఉందని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని