సెంట్రల్‌ బ్యాంకుల రికార్డు పసిడి కొనుగోళ్లు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు (సెంట్రల్‌ బ్యాంకులు) జులై- సెప్టెంబరులో మొత్తంగా 400 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన నివేదికలో వెల్లడించింది.

Published : 13 Nov 2022 01:31 IST

జులై- సెప్టెంబరులో 400 టన్నులు: డబ్ల్యూజీసీ

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు (సెంట్రల్‌ బ్యాంకులు) జులై- సెప్టెంబరులో మొత్తంగా 400 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన నివేదికలో వెల్లడించింది. ఒక త్రైమాసికంలో ఇదే అత్యధిక కొనుగోళ్లు అని తెలిపింది. ఇప్పటివరకు 2018 జులై- సెప్టెంబరులో నమోదైన 241 టన్నులే రికార్డు స్థాయిగా ఉండేది. అయితే దీనికి ఇంచుమించు రెట్టింపు స్థాయిలో తాజా పసిడి కొనుగోళ్లు నమోదుకావడం గమనార్హం. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌లో కొనుగోలు చేసిన 180 టన్నుల కంటే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. దీంతో మొత్తంగా ఈ ఏడాదిలో నికరంగా 673 టన్నుల పసిడిని కేంద్రీయ బ్యాంకులు చేసినట్లయ్యిందని డబ్ల్యూజీసీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొనడంతో.. పసిడిని హెడ్జింగ్‌ సాధనంగా ఉపయోగిస్తుండటం వల్ల పసిడికి గిరాకీ పెరిగిందని  తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు