అత్యంత బలమైన టెలికాం బ్రాండ్ జియో
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో, భారత్‌లో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్ అని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అంతర్గత విశ్లేషణా సంస్థ టీఆర్ఏ (గతంలో ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ) పేర్కొంది.
డేటా విశ్లేషణా సంస్థ టీఆర్ఏ
దిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో, భారత్‌లో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్ అని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అంతర్గత విశ్లేషణా సంస్థ టీఆర్ఏ (గతంలో ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ) పేర్కొంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంటే జియో ముందుందని వివరించింది. ‘భారతదేశం ఎక్కువగా కోరుకునే బ్రాండ్లు 2022’ పేరిట సంస్థ విడుదల చేసిన జాబితాలో బ్రాండ్ పటిష్ఠత ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం
* టెలికాం రంగంలో జియో మొదటి స్థానం పొందగా, తదుపరి స్థానాల్లో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఉన్నాయి.
* దుస్తుల విభాగంలో అడిడాస్ తొలిస్థానంలో ఉండగా, నైకీ, రేమండ్, అలెన్‌సోలీ, పీటర్ ఇంగ్లండ్ తరవాత స్థానాల్లో నిలిచాయి.
* వాహన విభాగంలో బీఎండబ్ల్యూ అగ్రస్థానంలో నిలవగా, టయోటా, హ్యుందాయ్, హోండా తదుపరి ఉన్నట్లు పేర్కొంది.
* బ్యాంకింగ్ - ఆర్థిక సేవల రంగాల్లో ఎల్ఐసీ, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ తొలి 3 స్థానాలు పొందాయి.
* వినియోగదారు ఉత్పత్తుల్లో కెంట్ తొలి స్థానం పొందిందని, లివ్‌ప్యూర్, ఒకాయ తదుపరి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది.
* వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌లో ఎల్జీ, సోని, శామ్సంగ్ తొలి 3 స్థానాలు పొందాయి.
* భిన్న రంగాల్లో విస్తరించిన గ్రూపుల్లో ఐటీసీ అగ్రస్థానం పొందగా, టాటా, రిలయన్స్ తదుపరి నిలిచాయని విశ్లేషించింది.
* ఇంధన విభాగంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్, అదానీ గ్రూప్‌లు వరుస అగ్రస్థానాల్లో నిలిచాయి.
* ఆహార పానీయాల రంగంలో ఆముల్ అగ్రస్థానం పొందగా, రెండోస్థానంలో నెస్కెఫే ఉంది. ఎఫ్ఎంసీజీలో ఫాగ్ తొలిస్థానంలో ఉంటే, లాక్మి, నీవియా, కోల్గేట్ తరవాత స్థానాల్లో ఉన్నాయి.
* అత్యంత వేగంగా కొనుగోళ్లు జరిగే విద్యుత్తు ఉత్పత్తుల్లో ఫిలిప్స్; గాడ్జెట్లలో ఎంఐ, ఆరోగ్య సంరక్షణలో హిమాలయ, ఆతిథ్యంలో ఐటీసీ హోటల్స్, తయారీలో ఏసీసీ, రిటైల్‌లో కేఎఫ్‌సీ, టెక్నాలజీ విభాగంలో డెల్ అగ్రస్థానాలు పొందినట్లు నివేదిక వివరించింది.
* ఇంటర్నెట్ బ్రాండ్లకు వస్తే అమెజాన్, ఫేస్బుక్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్ ముందున్నట్లు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురి మృతి!
-
Movies News
Ram Charan: నాన్న మౌనం వీడితే ఏమవుతుందో తెలీదు: హీరో రామ్‌చరణ్
-
General News
TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Movies News
Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు