Whatsapp: వాట్సప్‌ ఇండియా అధిపతి అభిజిత్‌ బోస్‌ రాజీనామా

వాట్సప్‌ ఇండియా అధిపతి అభిజిత్‌ బోస్‌, ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా పబ్లిక్‌ పాలసీ విభాగాధిపతి రాజీవ్‌ అగర్వాల్‌ తమ పదవులకు రాజీనామా చేసినట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా మంగళవారం వెల్లడించింది.

Updated : 16 Nov 2022 08:06 IST

ఇదే బాటలో మెటా పబ్లిక్‌ పాలసీ అధిపతి రాజీవ్‌ అగర్వాల్‌

దిల్లీ: వాట్సప్‌ ఇండియా అధిపతి అభిజిత్‌ బోస్‌, ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా పబ్లిక్‌ పాలసీ విభాగాధిపతి రాజీవ్‌ అగర్వాల్‌ తమ పదవులకు రాజీనామా చేసినట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా మంగళవారం వెల్లడించింది. మెటాలో అంతర్జాతీయంగా 11,000 మంది ఉద్యోగులకు లే-ఆఫ్‌ ప్రకటించిన వారం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. భారత్‌లో వాట్సప్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా కొనసాగుతున్న శివ్‌నాథ్‌ థుక్రాల్‌కు మెటా ఇండియా పబ్లిక్‌ పాలసీ బాధ్యతలు అప్పగించారు. ‘భారత్‌లో వాట్సప్‌కు తొలి హెడ్‌గా మంచి సేవలు అందించిన అభిజిత్‌ బోస్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అతని ఆధ్వర్యంలో సరికొత్త సేవలను కోట్ల మందికి, వ్యాపారాలకు అందించగలిగాం. భారత్‌కు వాట్సప్‌ మరిన్ని సేవలు అందిస్తుంద’ని వాట్సప్‌ హెడ్‌ విల్‌ కాథ్‌కార్ట్‌ వెల్లడించారు. 2019 ఫిబ్రవరిలో బోస్‌ వాట్సప్‌ తొలి కంట్రీ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వాట్సప్‌లోని అన్ని బృందాలకు వారం రోజులుగా కష్ట సయమం నడుస్తోందని బోస్‌ సామాజిక మాధ్యమ పోస్ట్‌ ద్వారా తెలిపారు. కొంత విరామం తర్వాత ‘ఎంటర్‌ప్రెన్యూరియల్‌ వరల్డ్‌’లో చేరతానని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు