Cryptocurrency: క్రిప్టో కట్టడి దిశగా అమెరికా

క్రిప్టో కరెన్సీలను నియంత్రించేలా ఒక చట్టం తీసుకురావాలంటూ అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు, ఫెడరల్‌ రిజర్వ్‌కు చెందిన అమెరికా బ్యాంకింగ్‌ నియంత్రణ సంస్థ విజ్ఞప్తి చేసింది.

Updated : 16 Nov 2022 07:37 IST

వాషింగ్టన్‌: క్రిప్టో కరెన్సీలను నియంత్రించేలా ఒక చట్టం తీసుకురావాలంటూ అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు, ఫెడరల్‌ రిజర్వ్‌కు చెందిన అమెరికా బ్యాంకింగ్‌ నియంత్రణ సంస్థ విజ్ఞప్తి చేసింది. గత వారం దిగ్గజ క్రిప్టో ఎక్స్ఛేంజీ ఎఫ్‌టీఎక్స్‌ కుప్పకూలిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ‘ఇటీవలి క్రిప్టో పరిణామాలను గమనిస్తే, వాటికి తగిన నియంత్రణ తప్పనిసరిగా అవసరమని తేలుతోంది. లేకపోతే పెట్టుబడిదార్లు, వినియోగదార్లకు ఎదురవుతున్న నష్టభయాలను వివరిస్తూ ఒక నివేదికను సిద్ధం చేసిన’ట్లు ఫెడ్‌ వైస్‌ ఛైర్‌ మైఖేల్‌ బార్‌ పేర్కొన్నారు. గత శుక్రవారం ఎఫ్‌టీఎక్స్‌ దివాలాకు దరఖాస్తు చేసింది కూడా. ‘కొన్ని ఆర్థిక వినూత్న ఉత్పత్తులు పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇందులో చాలా వరకు నష్టభయాన్నీ కలగజేస్తాయి. మోసాలు, అవకతవకలు, ఆస్తుల విలువ కరిగిపోవడం, వినియోగదార్ల నిధుల దుర్వినియోగం, దొంగతనం వంటి నష్టభయాలను సరిగ్గా నియంత్రించకపోతే రిటైల్‌ మదుపర్లకు ఇవి హానికలిగిస్తాయి. ఆర్థిక వ్యవస్థ భద్రత లక్ష్యాలను ఇవి దూరం చేస్తాయ’ని మైఖేల్‌ పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థకు వెలుపల ఎఫ్‌టీఎక్స్‌ పరిణామం చోటు చేసుకున్నప్పటికీ.. సంప్రదాయ ఆర్థిక వ్యవస్థకు, క్రిప్టోకరెన్సీకి మధ్య అంతర్గత అనుసంధానం అభివృద్ధి చెందితే మాత్రం వ్యవస్థాగత నష్టభయాలకూ అవకాశం ఉంటుంద’ని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని