మెటా భారత అధిపతిగా సంధ్యా దేవనాథన్‌

మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమిస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా గురువారం వెల్లడించింది.

Published : 18 Nov 2022 02:03 IST

దిల్లీ: మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమిస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా గురువారం వెల్లడించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ల మాతృ సంస్థ అయిన మెటా నుంచి ఇటీవల అజిత్‌ మోహన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలోకి సంధ్యను ఎంపిక చేశారు. ‘భారత్‌లో మా కొత్త నాయకురాలికి స్వాగతం చెప్పడం ఆనందంగా ఉంది. ఆమె నాయకత్వంలో భారత్‌లో మెటా వృద్ధి కొనసాగుతుంద’ని మెటా ముఖ్య వ్యాపార అధికారి మార్నే లెవిన్‌ వెల్లడించారు. సంధ్యా దేవనాథన్‌ 2016లో మెటాలో చేరారు. సింగపూర్‌, వియత్నాం వ్యాపారాలు, బృందాలతో పాటు ఆగ్నేయాసియాలో మెటా ఇ-కామర్స్‌ కార్యక్రమాల బాధ్యతలు చేపట్టారు. 2020లో ఇండోనేసియాకు వెళ్లి ఏపీఏసీ కోసం గేమింగ్‌ లీడ్‌గా పని చేస్తున్నారు. 2023 జనవరి 1 నుంచి ఆమె కొత్త బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. మెటా ఏపీఏసీ వైస్‌ ప్రెసిడెంట్‌ డ్యాన్‌ నియరీ ఆధ్వర్యంలో ఆమె పనిచేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని