21% తగ్గిన కార్యాలయ స్థలాల లీజింగ్‌

అక్టోబరులో దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల లీజింగ్‌ లావాదేవీల్లో 21 శాతం క్షీణత కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ వెల్లడించింది.

Published : 24 Nov 2022 06:49 IST

దిల్లీ: అక్టోబరులో దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల లీజింగ్‌ లావాదేవీల్లో 21 శాతం క్షీణత కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. గత ఏడాది అక్టోబరులో 85 లక్షల చదరపు అడుగుల స్థలం లీజ్‌కు వెళ్లగా, గత నెలలో 67 లక్షల చ.అ. స్థలాన్ని మాత్రమే కార్యాలయాల ఏర్పాటు కోసం తీసుకున్నారు. దేశ రాజధాని దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, కోల్‌కతా నగరాల్లో అన్ని రకాల కార్యాలయాల స్థలాలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు జేఎల్‌ఎల్‌ పేర్కొంది. మొత్తం అద్దె లావాదేవీల్లో 65 శాతం ముంబయిలో ఉండగా, తర్వాత స్థానాల్లో దిల్లీ, పుణె ఉన్నాయి. ఈ మూడు నగరాల్లోనే 93 శాతం వరకూ స్థలం అద్దెకు వెళ్లిందని జేఎల్‌ఎల్‌ పేర్కొంది. తయారీ రంగంలోని సంస్థలు అధిక స్థలాన్ని తీసుకోగా, టెక్నాలజీ సంస్థలు 15 శాతం మేరకే అద్దెకు తీసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని