ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 2023లో మాంద్యం రాకపోవచ్చు

ఆసియా పసిఫిక్‌ (ఏపీఏసీ) ప్రాంతంలో వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం తలెత్తక పోవచ్చని మూడీస్‌ అనలటిక్స్‌ అంచనా వేసింది.

Published : 25 Nov 2022 03:35 IST

మూడీస్‌ అనలిటిక్స్‌ అంచనా

దిల్లీ: ఆసియా పసిఫిక్‌ (ఏపీఏసీ) ప్రాంతంలో వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం తలెత్తక పోవచ్చని మూడీస్‌ అనలటిక్స్‌ అంచనా వేసింది. అయితే అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వాణిజ్య వృద్ధి మందగమనం ప్రభావం ఈ ప్రాంతంపైనా ఉంటుందని పేర్కొంది. భారత వృద్ధి వచ్చే ఏడాది నెమ్మదించొచ్చని తన నివేదికలో అంచనా వేసింది. వ్యవసాయం, సాంకేతికత రంగంలో ఉత్పాదకత ప్రయోజనాలు, పెట్టుబడుల రాక.. వృద్ధిని వేగవంతం చేస్తాయని వివరించింది. ఒకవేళ అధిక ద్రవ్యోల్బ ణ  పరిస్థితులు కొనసాగితే.. రెపో రేటును ఆర్‌బీఐ 6 శాతం ఎగువకు తీసుకువెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ పరిణామ ప్రభావం జీడీపీ వృద్ధిపై పడుతుందని తెలిపింది. 2021లో భారత వృద్ధి 8.5 శాతం కాగా, 2022లో 8 శాతం, 2023లో 5 శాతం నమోదుకావచ్చని గత ఆగస్టులో మూడీస్‌ పేర్కొంది. ‘అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి నెమ్మదించడం వల్ల.. వాణిజ్య ఆధారిత ప్రాంతమైన ఆసియా పసిఫిక్‌ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం కనిపించవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా ఒక్కటే బలహీనం కాలేదు. ఆసియాలో మరో దిగ్గజమైన భారత్‌ కూడా ఏడాదిక్రితంతో పోలిస్తే ఎగుమతుల విలువలో క్షీణతను నమోదుచేస్తోంది. అయితే వృద్ధికి కీలకమైన ఎగుమతులపై చైనాతో పోలిస్తే భారత్‌ తక్కువగా ఆధారపడి ఉండటం ఆ దేశానికి కలిసొచ్చే అంశమ’ని మూడీస్‌ అనలటిక్స్‌ చీఫ్‌ ఏపీఏసీ ఆర్థికవేత్త స్టీవ్‌ కోఖ్రానే తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని