వోల్వో 3 మోడళ్ల కార్ల ధరల పెంపు

వోల్వో కార్‌ ఇండియా 3 మోడళ్ల కార్ల ధరలను పెంచింది. ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 రీఛార్జ్‌ ధరలను నవంబరు 25 నుంచి 1.8 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

Published : 25 Nov 2022 03:36 IST

దిల్లీ: వోల్వో కార్‌ ఇండియా 3 మోడళ్ల కార్ల ధరలను పెంచింది. ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 రీఛార్జ్‌ ధరలను నవంబరు 25 నుంచి 1.8 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకు వ్యయాల భారం పెరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే ఎస్‌90 పెట్రోల్‌ మైల్డ్‌- హైబ్రిడ్‌, ఎక్స్‌సీ 40 పెట్రోలు మైల్డ్‌- హైబ్రిడ్‌ ధరల్లో మార్పులు చేయలేదు. ఎక్స్‌సీ40 రీఛార్జ్‌ ధర రూ.55.9 లక్షల నుంచి రూ.56.9 లక్షలకు పెరగనుంది. ఎక్స్‌సీ 60 ధర రూ.66.5 లక్షలకు, ఎక్స్‌సీ90 రూ.96.5 లక్షలకు పెరగనుంది. ఈనెల 24 వరకుపై మోడళ్లను బుకింగ్‌ చేసుకున్న వినియోగదార్లకు ధరల పెంపు వర్తించదని కంపెనీ హామీ ఇచ్చింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని