ఎల్‌ అండ్‌ టీ కన్సార్షియమ్‌కు గ్రీన్‌కో గ్రూపు ప్రాజెక్టు కాంట్రాక్టు

పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రీన్‌కో గ్రూపు మధ్యప్రదేశ్‌లో నిర్మిస్తున్న గాంధీసాగర్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్‌, హైడ్రోమెకానికల్‌ పనుల కాంట్రాక్టును ఎల్‌అండ్‌టీ కన్సార్షియం దక్కించుకుంది.

Updated : 25 Nov 2022 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రీన్‌కో గ్రూపు మధ్యప్రదేశ్‌లో నిర్మిస్తున్న గాంధీసాగర్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్‌, హైడ్రోమెకానికల్‌ పనుల కాంట్రాక్టును ఎల్‌అండ్‌టీ కన్సార్షియం దక్కించుకుంది. ఈ కాంట్రాక్టును 30 నెలల వ్యవధిలో పూర్తిచేయాలి. దీని విలువ రూ.1,000-2,500 కోట్ల మధ్య ఉంటుంది. ఈ ప్రాజెక్టు మనదేశంలోని అతిపెద్ద క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఒకటి అవుతుందని ఎల్‌అండ్‌టీ తెలిపింది. కర్బన వ్యర్థాల నివారణలో మనదేశం మరో ముందడుగు వేయడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొంది. ఇటువంటి ప్రాజెక్టుల్లో రెండు ఇంటర్‌-కనెక్టెడ్‌ రిజర్వాయర్లు నిర్మిస్తారు. విద్యుత్తుకు డిమాండ్‌ తక్కువగా ఉన్న సమయాల్లో నీటిని వృథా చేయకుండా ఎగువన ఉండే రిజర్వాయర్‌కు పంప్‌ చేస్తారు. విద్యుత్తుకు డిమాండ్‌ పెరిగినప్పుడు ఆ నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా అదనపు విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. తద్వారా 80 శాతానికి మించిన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని