Apple: యాపిల్‌కు సెకనుకు రూ.1.5 లక్షల లాభం

ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ సెకనుకు రూ.1.48 లక్షల లాభాన్ని (1,820 డాలర్లు) ఆర్జిస్తోందట. అంటే రోజుకు సంస్థ ఆర్జన సుమారు రూ.1,282 కోట్లు (157 మిలియన్‌ డాలర్లు).

Updated : 25 Nov 2022 08:35 IST

మైక్రోసాఫ్ట్‌కు రూ.1.1 లక్షలు

ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ సెకనుకు రూ.1.48 లక్షల లాభాన్ని (1,820 డాలర్లు) ఆర్జిస్తోందట. అంటే రోజుకు సంస్థ ఆర్జన సుమారు రూ.1,282 కోట్లు (157 మిలియన్‌ డాలర్లు). దీంతో ప్రపంచంలోనే అత్యధిక లాభదాయకత సంస్థల్లో యాపిల్‌దే మొదటి స్థానమని ఓ పరిశోధనా నివేదిక వెల్లడించింది. అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టిపాల్టీ ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ), బెర్క్‌షైర్‌ హాథ్‌వే (వారెన్‌ బఫెట్‌ సంస్థ) కూడా సెకనుకు 1000 డాలర్లకు పైగానే ఆర్జిస్తున్నాయి. ఈ సంస్థ రోజువారీ లాభం 100 మిలియన్‌ డాలర్లకు పైగానే. మైక్రోసాఫ్ట్‌ లాభం సెకనుకు రూ.1.14 లక్షలు (1404 డాలర్లు) , బెర్క్‌షైర్‌ హాథ్‌వే రూ.1.10 లక్షల (1,348 డాలర్లు) లాభాన్ని ఆర్జిస్తూ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాలుగు, ఐదు స్థానాల్లో ఆల్ఫాబెట్‌ (సెకనుకు 1,277 డాలర్లు), మెటా (924 డాలర్లు) ఉన్నాయి. మరోవైపు ఉబర్‌ టెక్నాలజీస్‌ సెకనుకు 215 డాలర్ల నష్టాన్ని చవిచూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని