ప్రవైగ్‌ విద్యుత్‌ ఎస్‌యూవీ డెఫై

బెంగళూరుకు చెందిన విద్యుత్‌ వాహన అంకుర సంస్థ ప్రవైగ్‌ డైనమిక్స్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ‘డెఫై’ను విడుదల చేసింది.

Published : 26 Nov 2022 03:10 IST

దిల్లీ: బెంగళూరుకు చెందిన విద్యుత్‌ వాహన అంకుర సంస్థ ప్రవైగ్‌ డైనమిక్స్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ‘డెఫై’ను విడుదల చేసింది. దీని ధర రూ.39.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కి.మీ వరకు ప్రయాణం చేయొచ్చని, 402 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఆడి ఇ-ట్రాన్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూసీ మోడళ్లతో డెఫై పోటీపడే అవకాశం ఉంది. డెఫై బుకింగ్‌లను శుక్రవారం ప్రారంభించామని, 2023 మూడో త్రైమాసికం నుంచి వినియోగదారులకు డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం 2028 నాటికి 10 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2024 నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని ప్రవైగ్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ రామ్‌ దివేది తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు