టయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్‌

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, తమ ఇన్నోవాలో హైబ్రిడ్‌ వెర్షన్‌ ‘హైక్రాస్‌’ను ఆవిష్కరించింది. 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు ఇ-డ్రైవ్‌ షిఫ్ట్‌ వ్యవస్థ ఇందులో ఉన్నాయి.

Published : 26 Nov 2022 03:10 IST

ముంబయి: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, తమ ఇన్నోవాలో హైబ్రిడ్‌ వెర్షన్‌ ‘హైక్రాస్‌’ను ఆవిష్కరించింది. 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు ఇ-డ్రైవ్‌ షిఫ్ట్‌ వ్యవస్థ ఇందులో ఉన్నాయి. శుక్రవారం బుకింగ్‌లు ప్రారంభమవ్వగా.. 2023 జనవరి నుంచి విక్రయశాలల్లో ఈ వాహనం లభిస్తుందని కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది మధ్య కల్లా బెంగళూరులోని రెండు తయారీ కేంద్రాల సామర్థ్య వినియోగం పూర్తిస్థాయికి చేరుకుంటుందని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్‌లో భారత్‌కు విద్యుత్‌ కార్లను తీసుకొస్తామని, కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం ప్రస్తుతం హైబ్రిడ్‌ కార్లపైనే దృష్టి పెట్టామని టయోటా కిర్లోస్కర్‌ వైస్‌ ఛైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని