కోల్ ఇండియాలో 5-10% వాటా విక్రయం?
కోల్ ఇండియా, హిందుస్థాన్ జింక్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్)లో 5-10 శాతం వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
హిందుస్తాన్ జింక్, ఆర్సీఎఫ్లోనూ..
ఖజానాకు రూ.16,500 కోట్లు
దిల్లీ: కోల్ ఇండియా, హిందుస్థాన్ జింక్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్)లో 5-10 శాతం వాటాను విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆదాయాలను పెంచుకునేందుకు, స్టాక్ మార్కెట్లో ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థల్లో చిన్న మొత్తం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం చూస్తోందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో దశలవారీగా ఈ వాటాలను విక్రయించాలని భావిస్తోందని తెలిపింది. షేర్ల ప్రస్తుత ధర ప్రకారం.. ప్రతిపాదిత వాటాల విక్రయం ద్వారా కనిష్ఠంగా ప్రభుత్వానికి రూ.16,500 కోట్లు లేదా 2 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉందని ఆ కథనం అంచనా వేసింది.
* హిందుస్థాన్ జింక్‌లో ప్రభుత్వం తన పూర్తి వాటాను విక్రయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఈ ఏడాది మేలో ఓ ఆంగ్ల వెబ్సైట్ పేర్కొంది. హిందుస్థాన్ జింక్‌లో ఒకప్పుడు అత్యధిక వాటా ప్రభుత్వం చేతిలోనే ఉండేది. 2022లో ఈ సంస్థలో 26 శాతం వాటాను అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంతా గ్రూపునకు విక్రయించింది. ఆ తర్వాత మరికొంత వాటాను కొనుగోలు చేయడంతో ఆ సంస్థలో వేదాంతా మొత్తం వాటా 64.92 శాతానికి చేరింది. ఇప్పుడు మిగిలిన వాటాలో ఎంత విక్రయించాలనుకుంటుందో ప్రకటించాల్సి ఉంది.
* ఈ ఏడాది రాష్ట్రీయ కెమికల్స్ ఫెర్టిలైజర్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో 10-20 శాతం వాటా విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలొచ్చాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2023-24లో సుమారు రూ.65,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఉత్పత్తిని మరింత పెంచుతాం.. కోల్ ఇండియా: రానున్న నెలల్లో బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతామని, తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని కోల్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కోల్ ఇండియాదే. 2022-23లో 700 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది నవంబరు 24 వరకు 400 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. 2021 ఇదే సమయంలో ఉత్పత్తి చేసిన 342 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Overseas Education: భారతీయ విద్యార్థుల గమ్యస్థానాలు అమెరికా, కెనడా, బ్రిటన్
-
World News
Video games: వీడియో గేమ్స్‌తో పిల్లల విజ్ఞాన సముపార్జన దెబ్బతినదు
-
Crime News
Andhra News: అనాథ దళిత యువతిపై వాలంటీరు అత్యాచారం
-
Ts-top-news News
TS EAMCET: ఇంటర్ ఫస్టియర్‌లో 70% సిలబస్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు
-
India News
Surrogacy: ‘సరోగసీ అమ్మకు.. జన్మించే బిడ్డతో జన్యుపరమైన బంధం ఉండదు’